యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ పంచుకున్నారు. తాను కోవిడ్ బారి నుండి కోలుకున్నట్లు తెలియజేశారు. ఎన్టీఆర్ ట్విట్టర్ పోస్ట్ ఫ్యాన్స్ లో ఆనందం నింపగా, భారీగా వైరల్ అవుతుంది. ఈనెల 10న ఎన్టీఆర్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలియజేశారు. గత రెండు వారాలుగా ఆయన ఇంట్లోనే క్వారంటైన్ కావడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. 


ఎన్టీఆర్ కి కోవిడ్ సోకడం ఆయన ఫ్యాన్స్ ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీనితో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేయడంతో పాటు విషెస్ తెలుపుతున్నారు. చిత్ర ప్రముఖులు సైతం ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలిపారు. 


కాగా నేడు తనకు కరోనా నెగిటివ్ గా తేలినట్లు ఎన్టీఆర్ చెప్పడంతో పాటు సంతోషం వ్యక్తం చేశాడు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేసిన ఫ్యాన్స్ కి, శ్రేయోభిలాషులకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు వైద్యం అందించిన డాక్టర్స్ కి కూడా పేరుపేరునా కృతజ్ఞతలు తెలపడం విశేషం. 


ఇక కోవిడ్ భారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, అయితే కరోనా ప్రాణాంతక వ్యాధి కాదని, మంచి వైద్యం, ఆహారం, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బయటపడవచ్చని సూచించారు. ముఖ్యంగా ఆత్మస్తైర్యమే ప్రధాన ఆయుధం అన్నారు. భయపడకుండా ధైర్యంగా ఉంటే కరోనాను ఎదిరించవచ్చు అని, తన అనుభవాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు ఎన్టీఆర్.