ఎన్టీఆర్ కొత్త గెటప్‌లోకి మారిపోయారు. ఆయన చూడ్డానికి `బాద్‌షా`లా కనిపిస్తుంది. తారక్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్న నయా లుక్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.
ఎన్టీఆర్ `ఆర్‌ఆర్‌ఆర్` లో కొమురం భీమ్‌గా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆయన పాత్రకి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రానికి జపాన్‌లోనూ మంచి స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అయిన ఎనిమిది నెలలవుతుంది. కానీ కొత్త సినిమా ప్రారంభం కాలేదు. కొరటాలతో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30 పేరుతో ఇది తెరకెక్కనుంది.
ఇప్పటి వరకు ఈ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. కానీ తాజాగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు ఎన్టీఆర్. తన లేటెస్ట్ లుక్‌ని పంచుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ గెటప్ సరికొత్తగా ఉంది. ఎప్పుడు ఉంగరాల జుట్టుతో కనిపించే ఎన్టీఆర్ తన లేటెస్ట్ ఫోటోలు పలుచగా, ముందుకు వచ్చి చాలా స్టయిలీష్‌గా ఉంది. మరోవైపు బ్లూ జీన్స్ షర్ట్ ధరించి, స్టయిల్‌గా ఉండే కూలింగ్ గ్లాసెస్ ధరించారు. సీట్లో కూర్చొని సీరియస్‌గా కంప్యూటర్‌ని వీక్షిస్తున్నట్టుగా ఆయన లుక్ ఉండటం విశేషం.
ఈ లేటెస్ట్ ఫోటోని ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఇందులో `ఓ కొత్త రోజు, కొత్త వైబ్, ఆలిమ్‌తో మరోసారి` అని పేర్కొన్నారు ఎన్టీఆర్. స్టార్ హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్‌తో ఆయన మరోసారి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ లెటెస్ట్ లుక్‌లో ఎన్టీఆర్ `బాద్‌షా` లుక్‌ని పోలి ఉండగా, ఈ నయా గెటప్ ఎందుకోసమనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఓ యాడ్ కోసం అని తెలుస్తుంది. తాజాగా ఎన్టీఆర్ ఓ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా చేయబోతున్న విసయం తెలిసిందే. ఆ యాడ్ షూట్ కోసం ఇలా కొత్త గెటప్‌లో కనిపించబోతున్నట్టు సమాచారం. మరి నిజంగానే ఈ కొత్త మేకోవర్ యాడ్ కోసమా లేక కొత్త సినిమా కోసమా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో సినిమా ఫుల్ స్వింగ్‌లో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల దర్శకుడు కొరటాల తన టెక్నీషియన్లతో సన్నివేశాలు డిస్కస్ చేస్తున్నట్టుగా ఓ ఫోటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్‌కి అన్ని రకాలుగా సన్నద్దమవుతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని టాక్.
