తెలుగు టెలివిజన్ రంగంలో భారీ సంచలనం గా మారిన రియీలిటీ షో బిగ్ బాస్ . ఈ షో ఇప్పటికే సీజన్స్ రెండు పూర్తయ్యి...మూడో సీజన్ కు రెడీ అవుతోంది. బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్‌లుగా ఎవరు రాబోతున్నారన్నదానిపై గత కొద్దిపెద్ద చర్చే నడుస్తోంది. అయితే అదే సమయంలో ఈ సీజన్ కు హోస్ట్ ఎంపిక కూడా కష్టంగా మారింది. ఎందుకంటే ఎవరిని అడిగనా నో చెప్తున్నారట. దానికి కారణం ఖాళీ లేకపోవటం కాదట...తమను ఎన్టీఆర్ తో పోల్చిచూసి..అలా చేయటం లేదని విమర్శలు వస్తాయని అంటున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ కు హోస్ట్ గా చేయటంతో ..ఆ తర్వాత వచ్చిన నాని ఎంత బాగా చేసినా తేలిపోయింది. ఎన్టీఆర్ లాగ నాని చేయలేకపోయారంటూ విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ లో తన టాలెంట్ తో కొన్ని స్టాండర్డ్స్ ని క్రియేట్ చేసారు. అది అందుకోవటం చాలా కష్టమని అంటున్నారు. దాంతో ఎన్టీఆర్ నే అడిగితే తనకు ఎంత ఇచ్చినా ఆర్ ఆర్ ఆర్ బిజిలో ఉండటంతో చేయలేనని చెప్పారట. ఆ తర్వాత వెంకటేష్ ,రానా, విజయ్ దేవరకొండ, అనుష్క అంటూ చాలా మంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి కానీ ఎవరూ ఆసక్తి చూపటం లేదు.   

వాస్తవానికి సీజన్ 1తో పోలిస్తే.. సీజన్ 2లో కంటెస్టెంట్స్ పెద్ద ఆసక్తికరంగా లేరనే  చెప్పాలి. ఆ ఇంపాక్ట్ రేటింగ్స్‌పై కూడా పడింది. అది గమనించిన యాజమాన్యం సీజన్ 3 ద్వారా ఆ లోటును పూడ్చేందుకు ఫేమస్ సెలబ్రిటీలను బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్‌గా హౌస్‌కి తీసుకురాబోతున్నారని సమాచారం.