Asianet News TeluguAsianet News Telugu

నా పై మా కుటుంబంలో పెద్ద కుట్ర జరుగుతోంది- ఎన్టీఆర్

  • తనపై కుట్ర జరుగుతోందన్న ఎన్టీఆర్
  • హైదరాబాద్ లో స్టార్ మా బిగ్ బాస్ ప్రమోషన్
  • కార్యక్రమంలో పాల్గొని కుట్ర కోణం గురించి వెల్లడించిన ఎన్టీఆర్
ntr says his family is conspiring behind him cospiracy

ఎన్టీఆర్ ను అడగాల్సింది ఇలాగేనా.. ఏమో కానీ సమాధానం మాత్రం దిమ్మతిరిగేలా ఇచ్చాడు బిగ్ బాస్. స్టార్ మా టీవీలో ఈ నెల 16న ప్రారంభం కానున్న బిగ్ బాస్ షో ప్రమోషన్ ఈవెంట్ లో ఎన్టీఆర్ కు..  మీ కుటుంబంలో వారిపై బిగ్ బాస్ తరహాలో కెమెరా పెట్టి ఏమైనా తెలుసుకోవాలని అనిపించిందా అని ప్రశ్న ఎదురైంది.

 

దానికి సమాధానంగా ఖచ్చితంగా నాపై నా ఇంట్లో ఏదో కుట్ర జరుగుతోందని, దాని గురించి తెలుసుకోవాల్సి వుందని ఎన్టీఆర్ సమాధానమిచ్చారు. ఇంతకీ మేటరేంటంటే... యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో ‘బిగ్ బాస్’ షో లాంచ్ ఈవెంట్లో  మీడియాతో మాట్లాడుతూ... తన కొడుకు అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇంటికి వస్తే..వాడితోనే పూర్తి కాలక్షేపం అని, అయితే ఈ మద్య జరిగిన ఓ సంఘటనతో ఖంగు తిన్నానని అంటున్నాడు.

 

తాను ప్రతిరోజూ షూటింగ్ కు వెళ్లే ముందు దగ్గరకి తీసుకుని "నీకు ఎవరంటే ఇష్టం నాన్నా...అమ్మా? నాన్నా?" అని అడిగితే వాడు టక్కున "నాన్న" అని అసమాధానం చెప్పేవాడని..ఈ మద్య షూటింగ్ లో కాస్త బిజీగా ఉన్నానని.. వాడిని కలవడం కాస్త లేట్ అవుతుందని.. నేను షూటింగ్ నుంచి వచ్చేసరికి తను నిద్రపోతున్నాడని..., మళ్లీ నేను నిద్రలేచేసరికి స్కూల్ కి వెళ్లిపోతున్నాడని, దీనివల్లే పెద్ద గ్యాప్ ఏర్పడి తాను ఊహించని సంగతులు బయట పడుతున్నాయని ఎన్టీఆర్ అన్నాడు.  

 

ఈ మద్య వాడు  "నాన్నా" అనుకుంటూ తన దగ్గరకి వచ్చాడని, వాడితో మాట్లాడుతూ.."నాన్నా నీకు ఎవరంటే ఇష్టం అమ్మా? నాన్నా?" అని అడగ్గానే ఎప్పుడూ "నాన్న" అనే వాడు అకస్మాత్తుగా "అమ్మ" అనేశాడని దాంతో నేను షాక్ తిన్నానని అన్నాడు.

 

అయితే నాపై తల్లీకొడుకులు ఏదైనా కుట్ర పన్నారా.. వీరిద్దరూ కలిసి పోయారా.. అసలు ఏం జరుగుతుందో నేను వెంటనే తెలుసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ సరదాగా వ్యాఖ్యానించడంతో.. ప్రాంగణమంతా నవ్వులు పూశాయి. నిజాయితీగా సమాధానం ఇచ్చిన ఎన్టీఆర్ అంతే నిక్కచ్చిగానూ ఓ ఊహించని ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చి ఆకట్టుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios