టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. 'అర్జున్ రెడ్డి' సినిమాతో అతడు కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా తరువాత ఈ దర్శకుడు మహేష్ బాబు, శర్వానంద్ లాంటి హీరోలతో పని చేస్తారని వార్తలు వినిపించాయి.

కానీ సందీప్ రెడ్డి.. బాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' రీమేక్ తెరకెక్కిస్తున్నాడు. 'కబీర్ సింగ్' అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా జంటగా కనిపించనున్నారు. ఇది ఇలా ఉండగా.. సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి ఇప్పుడు ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడని టాక్.

రీసెంట్ గా రామ్ చరణ్ ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి ఎన్టీఆర్ తో పాటు చాలా మంది సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిలో సందీప్ రెడ్డి వంగ కూడా ఉన్నాడు. ఈ పార్టీలో సందీప్, ఎన్టీఆర్ లు ఇద్దరూ మాట్లాడుకొని సినిమా చేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

త్వరలోనే ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ వినిపించాలని ప్లాన్ చేస్తున్నాడట సందీప్ రెడ్డి. వయిలెంట్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ ఏడాదిలో రాజమౌళి సినిమా పూర్తైన తరువాత  తారక్.. సందీప్ తో కలిసి పని చేస్తాడని అంటున్నారు.