దర్శక ధీరుడు రాజమౌళి నేడు(శనివారం)తన 47వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన బర్త్ డే విశెష్‌లు వెల్లువలలా వస్తున్నాయి. అందులో భాగంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. 

`విష్‌ యు ఏ వెరీ హ్యాపీ బర్త్ డే జక్కన్న. లవ్యూ` అని పేర్కొంటూ ఆయనతో సెట్‌లో సరదాగా మాట్లాడుకుంటున్న ఓ ఫోటోని పంచుకున్నారు. ఇద్దరు నవ్వుతూ ఉన్న ఫోటో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీనిపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. `మీ ఇద్దరి బంధం ఎప్పటికీ ఇలానే ఉండాల`ని అని కోరుకుంటున్నారు. దీన్నొక ట్రెండ్‌ చేస్తున్నారు. 

ఎన్టీఆర్‌ నటించిన `స్టూడెంట్‌ నెం.1` తోనే రాజమౌళి దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఓ రకంగా ఎన్టీఆర్‌కిది మొదటి సినిమా అనే చెప్పాలి. ఆ తర్వాత `సింహాద్రి`, `యమదొంగ` చిత్రాలు వీరి కాంబినేషన్‌లో వచ్చి బ్లాక్‌ బస్టర్‌ సాధించాయి. ప్రస్తుతం `ఆర్‌ ఆర్‌ ఆర్‌` రూపొందుతుంది. ఇందులో మరో హీరోగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ కొమురంభీమ్‌ పాత్రలో కనిపించనున్నారు. 

మరోవైపు `ఆర్‌ఆర్‌ ఆర్` బ్యానర్‌ డివివి ఎంటర్టైన్‌మెంట్‌ సైతం రాజమౌళికి విశెష్‌ చెబుతూ ఓ పోస్టర్‌ని పంచుకున్నారు.