'రండి గెలుద్దాం... ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' అంటూ పిలిచాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. గ‌తంలో నాగార్జున‌, చిరంజీవి  'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' అంటూ అల‌రించారు. ఈసారి ఈ షో జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాను అన్నారు.   ఇక్కడ 'కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది' అంటూ ఊరించారు. అయితే ఆ కలలన్నిటినీ కరోనా దెబ్బ కొట్టేసింది. దాంతో ఈ షో ను పూర్తి గా ఆపేసారని, ఎన్టీఆర్ డేట్స్ ఎడ్జెస్ట్ అవటం కష్టమని వద్దనుకుంటున్నారని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. వాటికి టీవి చానెల్ చెక్ పెట్టాలనుకుంది.  ఇదిలా ఉంటే తాజాగా జెమినీ టీవీ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రోమో వదిలింది.

అందులో మీలో ఎవరు కోటీశ్వరులు అనే టైటిల్ పేరుతో సహా ఎన్టీఆర్ ఉన్న ఫోటోను ప్రోమోగా వదిలారు. మొత్తానికి ఈ ప్రోమో తో ఆగిపోయిందనే రూమర్స్ కు చెక్ పడింది. దీంతో ఈ షో త్వరలోనే ప్రారంభం కానుందని ఖరారు అయ్యినట్లైంది. అయితే.. ఇక ఈ షో ఎప్పటి నుండి మొదలవుతుందో అనే సమయాన్ని మాత్రం ప్రకటించలేదు. మొత్తానికి ఈ షో కోసం ఎదురు చూస్తున్న అభిమాలకు మాత్రం కాస్త ఉపశమనం కలగింది.

ఇక కొద్ది రోజుల క్రితం ఈ షోకు సంభందించిి కొన్ని టెలిఫోన్ రౌండ్స్ కూడా జరిగి ఇంక షో స్టార్ట్ అవుతున్న సమయంలో కేసులు పెరగటంతో షో ప్రారంభం కాకుండా ఆపేసారు. ఇప్పుడున్న పరిస్దితుల్లో అంతమంది కంటిస్టెంట్స్ ని మానేజ్ చేయటం కష్టమని టీమ్ అభిప్రాయపడింది. అన్ని బాగుంటే ఆగస్టు నుంచి షో స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు.  ఈ షో కోసం ఎన్టీఆర్ ఇచ్చిన డేట్స్ అన్నీ వేస్ట్ అయ్యాయి. ఈ షో నిమిత్తం ఎన్టీఆర్ కు 10 కోట్లు దాకా ఇస్తున్నారు. అలాగే భారీగా అడ్వాన్స్ ముట్టచెప్పారట.  

ఇక ఎన్టీఆర్ తాజా చిత్రం విషయానికి వస్తే..యాక్షన్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ మరో హీరోగా కనిపించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌ను రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌, రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ భామ ఆలియాభట్‌ సందడి చేయనున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌, హాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.