బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరవాత దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా చేయబోతున్నాడా అని దేశమంతా ఆసక్తిగా చూస్తున్న వేళ ఎవరూ ఊహించని విధంగా టాలీవుడ్ లో అతి పెద్ద మల్టీ స్టారర్ మూవీకి రెడీ అయ్యాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు మరో భారీ బడ్జెట్ మూవీ తీయడానికి ప్లాన్ చేశాడు.  

జక్కన్న తీస్తున్న మల్టీస్టారర్ మూవీకి సంబంధించి పనులు అఫీషియల్ గా ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఎప్పటిలాగే రాజమౌళి స్వయంగా చూసుకుంటున్నాడు. సినిమాలో డైలాగ్ వెర్షన్ కూడా షూటింగ్ కన్నా ముందే సిద్ధం చేసేస్తున్నారనేది జక్కన్న సన్నిహితుల మాట. ఈ పని కూడా దాదాపుగా కంప్లీట్ కాగా.. స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ అయ్యిందని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి గ్రాఫిక్ వర్క్ కోసం చరణ్ అండ్ ఎన్టీఆర్ యూఎస్ వెళ్లి బాడీ స్కాన్ చేయించుకుని వచ్చారు. సినిమా షూటింగ్ మొదలుపెట్టేసరికి సగం వర్క్ కంప్లీట్ చేసేలా జక్కన్న ప్లానింగ్ సాగుతోంది. 

ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో... రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. వీళ్లిద్దరూ ఈ మూవీ షూట్ పనులు పూర్తి చేసిన వెంటనే రాజమౌళి సినిమా కోసం పూర్తి సమయం కేటాయించనున్నారు. ఇందులో హీరోయిన్లుగా ఇంతవరకు ఎవరినీ కన్ఫర్మ్ చేయలేదు.