ఆర్ ఆర్ ఆర్ ఫాన్స్ విజయ్ అభిమానులపై ఫైర్ అవుతున్నారు. రేపు బీస్ట్ విడుదలయ్యాక మీకు చుక్కలు చూపిస్తాం అంటూ... వార్నింగ్స్ ఇస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్ అంతగా కోప్పడడానికి కారణం ఏంటో చూద్దాం...
అరవ పైత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో కాదు ఏకంగా ప్రపంచంలోనే తమను మించినవారు లేరనేది వాళ్ళ అతివిశ్వాసం. రంగం ఏదైనా మేమే ముందంటారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల వారి ప్రతిభను ఒప్పుకోవడానికి అసలు ఇష్టపడరు. ఇక బాహుబలి తర్వాత కోలీవుడ్ పై టాలీవుడ్ పైచేయి సాధించింది. దేశంలోనే భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే పరిశ్రమగా టాలీవుడ్ ఎదిగింది. హిందీ పరిశ్రమ సైతం టాలీవుడ్ గొప్పతనాన్ని ఒప్పుకోవడంతో పాటు, మన సినిమాలను, హీరోలను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.
కోలీవుడ్ మాత్రం ఈ నిజాన్ని ఒప్పుకోలేకపోతుంది. దేశంలోనే నంబర్ వన్ డైరెక్టర్ గా అవతరించిన రాజమౌళి (Rajamouli)నిర్మించిన ఆర్ ఆర్ ఆర్ మూవీపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని కంకణం కట్టుకున్నారు. అర్థరాత్రి నుండే కోలీవుడ్ స్టార్ విజయ్ ఫ్యాన్స్ ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో గ్రాఫిక్స్ సరిగా లేవు, చెత్త సినిమా, డబ్బులు దండగ అంటూ... ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. హీరో విజయ్ ప్రొఫైల్ పిక్ కలిగిన అనేక మంది తమిళులు ఆర్ ఆర్ ఆర్ సినిమా అసలు బాగోలేదంటూ వరుస ట్వీట్స్ వేశారు.
ఇది గమనించిన ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చింది. తమిళ ఆడియన్స్, విజయ్ (Vijay) ఫ్యాన్స్ ఉద్దేశపూర్వకంగా ఆర్ ఆర్ ఆర్ పై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు, పట్టించుకోవద్దని కౌంటర్ ట్వీట్స్ వేస్తున్నారు. అలాగే త్వరలో బీస్ట్ (Beast)విడుదల ఉండగా.. ఆ మూవీని ఇలానే తొక్కేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ పై గుర్రుగా ఉన్న చరణ్, ఎన్టీఆర్ అభిమానులు బీస్ట్ మూవీ అంతు చూస్తాం అంటున్నారు.
సోషల్ మీడియా ప్రభావం పెరిగాక ఈ అనారోగ్యకరమైన వాతావరణం చేసుకుంటుంది. ఓ స్టార్ హీరో మూవీ విడుదలవుతుందంటే చాలు యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. సినిమా అసలు టాక్ తో సంబంధం లేకుండా మూవీలో అది బాగోలేదు, ఇది బాగోలేదంటూ ఫేక్ ట్వీట్స్ వేస్తున్నారు. చాలా మంది నెటిజెన్స్ ఈ ట్విట్టర్ టాక్, సోషల్ మీడియా ట్రెండ్ ఆధారంగా సినిమాను జడ్జి చేస్తున్నారు. దీనితో మంచి సినిమాలు కూడా వసూళ్లను కోల్పోతున్నాయి. ఫ్యాన్ వార్స్ పేరుతో బడా చిత్రాలపై కూడా నెగిటివ్ రివ్యూలు ప్రచారం చేస్తూ.. నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెడుతున్నారు.
