`ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ, రామ్‌చరణ్‌ హాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. `హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌`లో ఐదు అవార్డులను అందుకోగా, ఇప్పుడు హాలీవుడ్‌ దిగ్గజ నటులతో మరో ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నారు.

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా ఇండియన్‌ సినిమా గొప్పతనాన్ని అంతర్జాతీయంగా చాటుతుంది. ముఖ్యంగా వెస్ట్ సైడ్‌లో భారతీయ సినిమా సత్తాని చాటుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. `నాటు నాటు` పాటకి పలు అవార్డులు వరించాయి. ఏకంగా `ఆస్కార్‌`కి నామినేట్‌ అయ్యింది. దీనికితోడు ఇప్పుడు ఐదు విభాగాల్లో హాలీవుడ్‌ క్రిటిక్స్ అసోసియేషన్‌ అవార్డులను అందుకుంది. ఇందులో భాగంగా రామ్‌చరణ్‌కి స్పాట్‌లైట్‌ అవార్డు వరించింది. 

అంతేకాదు అంతర్జాతీయ వేదికపై, అది కూడా హాలీవుడ్‌ వేదికపై వారికి అవార్డు అందించే అరుదైన గౌరవం రామ్‌చరణ్‌కి దక్కడం విశేషం. ఓ వైపు అవార్డులు, ప్రశంసలు దక్కుతుండగా, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు కోసం రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ పోటీ పడుతున్నారు. అది కూడా హాలీవుడ్‌ దిగ్గజాలతో పోటీ పడుతుండటం విశేషం. యాక్షన్‌ మూవీ విభాగంలో ఈ ఇద్దరు `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికిగానూ నామినేట్‌ కావడం మరో విశేషం.

క్రిటిక్‌ ఛాయిస్‌ సూపర్‌ అవార్డుల నామినేషన్లని ప్రకటించారు. ఇందులో బెస్ట్ యాక్టర్స్ విభాగంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఇద్దరూ నామినేట్‌ కావడం విశేషం. అంతేకాదు హాలీవుడ్‌ దిగ్గజ నటులైన టామ్‌ క్యూజ్‌, బ్రాడ్‌ పిట్‌, నికోలస్‌ కేజ్‌లతో కలిసి వీరి క్రిటిక్‌ ఛాయిస్‌ అవార్డుల కోసం పోటీ పడుతుండటం మరో విశేషం. ఈ విషయాన్ని క్రిటిక్ ఛాయిస్‌ అవార్డుల కమిటీ ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించగా, దీన్ని రామ్‌చరణ్‌ రీ ట్వీట్‌ చేస్తూ, తన ఆనందాన్ని పంచుకున్నారు. 

`యాక్షన్‌ మూవీస్‌లో ఉత్తమ నటుడిగా నా సోదరుడు ఎన్టీఆర్‌తోపాటు నా పేరు నామినేట్‌ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. అంతేకాదు నికోలస్‌ కేజ్‌, టామ్‌ క్రూజ్‌, బ్రాడ్‌ పిట్‌ వంటి దిగ్గజాల పక్కన మన పేర్లని చూడటం ఎంతో అద్భుతమైన అనుభూతి` అని పేర్కొన్నారు రామ్‌చరణ్‌. మార్చి 16న ఈ అవార్డులను ప్రకటించనున్నారు. 

Scroll to load tweet…

మరోవైపు హాలీవుడ్‌ క్రిటిక్స్ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అవార్డులపై చరణ్‌ స్పందిస్తూ, `హెచ్‌సీఏ 2023లో రాజమౌళి, కీరవాణిలతో కలిసి భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించినందుకుంద చాలా గౌరవంగా ఉంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌గా మాకు లభించిన గుర్తింపు పట్ల నేను గర్విస్తున్నా` అని పేర్కొన్నారు చరణ్‌. అలాగే తనని అవార్డు ప్రజెంటర్‌గా ఆహ్వానించిన నటి ఏంజెలీ బస్సెట్‌కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాడు చరణ్‌. అంతేకాదు త్వరలో కలిసి సెల్ఫీ తీసుకుందామని వెల్లడించారు. 

Scroll to load tweet…