అజయ్‌ దేవగన్‌ అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌ పాత్రలకు దీటుగా అజయ్‌ దేవగన్‌ రోల్‌ ఉంటుందని తాజాగా ఆయన మోషన్‌ పోస్టర్‌ చూస్తుంటే అర్థమవుతుంది.

`ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం నుంచి కీలక పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్‌ని పరిచయం చేసింది చిత్ర బృందం. శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. యుద్ద వీరుడిగా, తమ ప్రాంత ప్రజల నాయకుడిగా తమ ప్రజల కోసం ప్రాణాలైనా లెక్కచేయని యోధుడిగా కనిపిస్తున్నాడు అజయ్‌ దేవగన్‌. బ్రిటీష్‌ సైన్యం తనని చుట్టుముట్టి గన్స్ ఎక్కుపెట్టి `లోడ్‌.. ఎయిమ్‌.. షూట్‌` అంటూ షూట్‌ చేయడానికి ముందుకు వస్తుండగా, తాను చుట్టుకున్న క్లాత్‌ని విప్పి పంజా విప్పిన పులిలా చూస్తున్న అజయ్‌ లుక్‌ నిజంగానే గూస్‌బమ్స్ ని తెప్పిస్తుంది. ప్రస్తుతం ఇది తెగ వైరల్‌ అవుతుంది. 

ఇందులో అజయ్‌ దేవగన్‌ అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌ పాత్రలకు దీటుగా అజయ్‌ దేవగన్‌ రోల్‌ ఉంటుందని తాజాగా ఆయన మోషన్‌ పోస్టర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేస్తూ, దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఆయన గొప్పతనాన్ని ప్రశంసించారు. ఆయన పాత్ర గురించి రాజమౌళి చెబుతూ, `అతను తన ప్రజలను శక్తివంతం చేయడం నుంచి బలాన్ని పొందుతాడు` అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

ఎన్టీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేస్తూ, `అతను తన మనుష్యులందరూ బుల్సే కొట్టేలా చూస్తాడు. ఇంతవరకెప్పుడూ చూడని విధంగా కొత్త అవతార్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌`లో కనిపించబోతున్నాడు` అని అజయ్‌ దేవగన్‌కి బర్త్ డే విషెస్‌ తెలిపారు. రామ్‌చరణ్‌ స్పందిస్తూ, `అతను తన ప్రజలను శక్తివంతం చేసే పనిలో ఉన్నాడు. బలమైన, భావోద్వేగ, స్ఫూర్తిదాయకమైన ముద్రని వేయబోతున్నాడు. అజయ్‌ దేవగన్‌ సర్‌ ఇది మీకు గొప్ప అనుభవం` అని చెప్పారు. మొత్తంగా తన ప్రజలే ఆయన బలమని ఎన్టీఆర్‌, చరణ్‌, రాజమౌళి చెబుతున్నారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

ప్రస్తుతం ఇది లక్షల వ్యూస్‌తో దూసుకుపోతుంది. సినిమాపై మరింత అంచనాలను పెంచుతుంది. ఇక ఇందులో చరణ్‌కి జోడిగా అలియాభట్‌, ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 13న దసరా కానుకగా విడుదల కానుంది. పాన్‌ ఇండియా సినిమాగా దాదాపు పది భాషల్లో దీన్ని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.