ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చాయి. సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలిపారు.

ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం `దేవర` చిత్రం రూపొందుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న చిత్రమిది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఉరమాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కొరటాల. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని రిలజీ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ బజ్ నెలకొంది. బిజినెస్ పరంగానూ ఇప్పట్నుంచి సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది.
ఇదిలా ఉంటే నెక్ట్స్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన `సలార్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదల కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడే వార్తని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు.
ఎన్టీఆర్ మూవీని వచ్చే ఏడాది ప్రారంభిస్తారట. తారక్ నటిస్తున్న `దేవర` చిత్రం విడుదలైన తర్వాత తమ సినిమా స్టార్ట్ అవుతుందని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే టైమ్‌లో ఈ సినిమాని ప్రారంభిస్తామని, ఇది భారీ యాక్షన్ మూవీగా ఉండోబోతుందని తెలిపారు. ఫ్యాన్స్ పండగ చేసుకునే, ఎన్టీఆర్ ఇమేజ్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లేలా ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.