ఎన్టీఆర్ ఊసరవెల్లికి 12 ఏళ్లు... రీ రిలీజ్ కు డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్..
అసలు ఎలా ప్లాప్ అయ్యిందో తెలియదు కాని... ఎన్టీఆర్ కెరీర్ లో ఫ్యాన్స్ కు అంతుచిక్కిన నిరాశగామిగిలిపోయింది ఊసరవెల్లి సినిమా. ఈమూవీ ఫ్యాన్స్ తో పాటు.. కామన్ ఆడియన్స్ కు కూడా బాగా నచ్చింది. కాని హిట్ మాత్రం కొట్టలేకపోయింది. తాజాగా ఊసరవెల్లి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ లో తెరకెక్కిన ఏకైక సినిమా ఊసరవెల్లి. అంతే కాదు.. పక్కాగా హిట్ అవుతుంది అనుకుని చేసిన ఈమూవీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వక్కంతం వంశీ కథతో తెరకెక్కిన ఈ సినిమా 2011 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. 27.6 కోట్ల కలెక్షన్లను సాధించింది ఈ సినిమా. ఇక ఈమూవీ రిలీజ్ అయ్యి అప్పుడే 12 ఏళ్లు పూర్తయ్యాయని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
టోనీపాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతం.. తమన్నాతో కాంబినేషన్ సీన్లు పేలిపోయాయి.. ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా ఉన్న (Oosaravelli) ఈ సినిమా సెకండాఫ్ లోని కొన్ని మైనస్ ల వల్ల బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు విడుదలై ఉంటే కమర్షియల్ గా సక్సెస్ సాధించేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఫ్లాష్ బ్యాక్ మరింత బెటర్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో చాలామంది ఇప్పటికీ ఈ సినిమాను తలుచుకుని బాధపడుతుంటారు.
ఊసరవెల్లి సినిమాలో తారక్ యాక్టింగ్ కాని.. లుక్, హెయిర్ స్టైల్ అంతా కొత్తగా ఉంటాయి. అంతే కాదు ఈమూవీకి పెద్ద మ్యూజికల్ హిట్ కూడా. ఈ సినిమా కోసం అద్నాన్ సమీఖాన్ ఆలపించిన నేనంటే నాకు చాలా ఇష్టం పాటతో పాటు.. నిహారిక నిహారిక సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఈక్రమంలోనే ఊసరవెల్లి సినిమాను కూడా రీరిలీజ్ చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. మరి వారి కోరిక మేరకు త్వరలో ఈ సినిమా రీ రిలీజ్ అవుతుందేమో చూడాలి.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా బిజీలో ఉన్నారు. తాజాగా అప్ డేట్ ను కూడా ఇచ్చారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. పక్కా మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈమూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈసినిమాపై సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ టాపిక్స్ రన్ అవుతున్నాయి. దేవర సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరగబోతున్నట్టు తెలుస్తోంది. నెక్ట్స్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో ఈసినిమాలోని మొదటి భాగాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.