‘యన్‌.టి.ఆర్‌-కథానాయకుడు’ చిత్ర  యూనిట్ ని సినీ సెలబ్రెటీలు ఒక్కొక్కరిగా అభినందిస్తున్నారు. బుధవారం విడుదలైన ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. మోహన్‌బాబు, మహేశ్‌బాబు, అశ్వినిదత్‌, కోన వెంకట్‌, నాగ్‌ అశ్విన్‌, అనిల్‌ రావిపూడి, సుధీర్‌బాబు, మనోజ్‌ కుమార్‌, బీవీఎస్‌ రవి, గోపీ మోహన్‌, మంచు విష్ణు, కొరటాల శివ, గోపీచంద్‌ మలినేని తదితరులు సినిమా అద్భుతంగా ఉందని ట్వీట్లు చేశారు. అయితే ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని ఎన్టీఆర్ చెప్తారేమో అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండిపోయారు.

ఎన్టీఆర్ కథా నాయకుడు ప్రీ రిలీజ్ అనంతరం ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవటం చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది. రిలీజ్ ముందు...తర్వాత సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి మాట్లాడతేరేమో అని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురు అవుతోంది.  ముఖ్యంగా నందమూరి అభిమానులకు ఈ సైలెన్స్ ని ఎలా అర్దం చేసుకోవాలో అర్దం కావటం లేదని వినికిడి. 

తన తాతగారి బయోపిక్ పై ఎన్టీఆర్ మాట్లాడకపోవటం అనేది కావాలనే జరుగుతోందా లేక ఏదైనా బిజీలో ఉన్నారా అనేది తెలియటం లేదు. అయితే ఓ వర్గం మాత్రం మళ్లీ నందమూరి కుటుంబం ,బాలయ్య ఆయన్ని దూరం పెట్టారని అంటున్నారు. ఎన్టీఆర్ కు స్పెషల్ షో వేసి చూపిస్తారనుకుంటే అదీ జరగలేదు అంటున్నారు. అదేమీ కాదు ప్రీ రిలీజ్ పంక్షన్ లోనే ఏదో జరిగిందని, ఎన్టీఆర్ హర్ట్ అయ్యారని మరి కొందరు అనుమానిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో ఓ రేంజిలో చర్చ జరుగుతోంది. 

ఎన్టీఆర్‌ బయోపిక్‌కు సంబంధించిన రెండో భాగం ‘యన్‌.టి.ఆర్‌-మహానాయకుడు’ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ నిర్మాత. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బాణీలు అందిస్తున్నారు.