Asianet News TeluguAsianet News Telugu

చిరు, నాగ్ ల  'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాకు నచ్చలేదన్న ఎన్టీఆర్, అందుకే మార్చేశాడట!

నాగ్, చిరంజీవి హోస్ట్స్ గా ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం  టైటిల్ తనకు నచ్చలేదని ఎన్టీఆర్ తెలియజేశారు. షోకి ఆడవాళ్లు కూడా వస్తారు. కాబట్టి కోటీశ్వరుడు అని కేవలం మగవాళ్ళను ఉద్దేశిస్తున్నట్లు ఉన్న టైటిల్ నాకు నచ్చలేదు, అందుకే ఎవరు మీలో కోటీశ్వరులు అని మార్చినట్లు ఎన్టీఆర్ తెలియజేశారు. 
 

ntr not happy with meelo evaru koteeswarudu thats why he changed title
Author
Hyderabad, First Published Aug 24, 2021, 12:21 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


ఎవరు మీలో కోటీశ్వరులు మొదటి ఎపిసోడ్ కి సూపర్ రెస్పాన్స్ దక్కింది. హోస్ట్ గా ఎన్టీఆర్ గెస్ట్ గా చరణ్ మాటల గారడితో ఆకట్టుకున్నారు. భీమ్, అల్లూరిల మధ్య సాగిన సంభాషణలు ప్రేక్షకులకు సరదా పంచాయి. మును ముందు ఎన్టీఆర్ నేతృత్వంలోని ఎవరు మీలో కోటీశ్వరులు షో రేటింగ్ పరంగా ప్రభంజనం కానుందని అర్థం అవుతుంది. కాగా గతంలో ఈ షో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో మా ఛానెల్ లో ప్రసారమయ్యేది. 

'ఎవరు మీలో కోటీశ్వరులు'గా పేరు మార్చుకున్న లేటెస్ట్ సీజన్ జెమినీ టీవీలో ప్రసారం అవుతుంది. నాగ్, చిరంజీవి హోస్ట్స్ గా ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం  టైటిల్ తనకు నచ్చలేదని ఎన్టీఆర్ తెలియజేశారు. షోకి ఆడవాళ్లు కూడా వస్తారు. కాబట్టి కోటీశ్వరుడు అని కేవలం మగవాళ్ళను ఉద్దేశిస్తున్నట్లు ఉన్న టైటిల్ నాకు నచ్చలేదు, అందుకే ఎవరు మీలో కోటీశ్వరులు అని మార్చినట్లు ఎన్టీఆర్ తెలియజేశారు. 

టెలివిజన్ హోస్ట్ గా ఎన్టీఆర్ కి ఇది రెండవ ప్రోగ్రామ్. 2017లో ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ కాగా, మంచి ఆదరణ దక్కింది. దీనితో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం కోసం కోరిమరీ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపారు. 


మరోవైపు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ దాదాపు పూర్తి చేశారు ఎన్టీఆర్, ఇటీవల ఉక్రెయిన్ షెడ్యూల్ ముగించుకొని ఇండియాకు రావడం జరిగింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుపుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ ని అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. అయితే ఆర్ ఆర్ ఆర్ విడుదల వచ్చే ఏడాది సమ్మర్ కి వాయిదా వేసే ఆలోచనలో యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios