జనతా గ్యారేజ్ వచ్చింది సూపర్ హిట్టైంది మరి జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమా ఏంటి ఎన్.టీ .ఆర్ కొత్త మూవీపై క్లారిటీ వచ్చేసిందా
జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యాక జూనియర్ ఏం మూవీ చేస్తాడా అని అంతా ఎదురు చూస్తున్న సమయం.అటు ఎన్టీఆర్ కూడా తన కొత్త సినిమా గురించి ఎక్కడ మాట్లాడకపోయే సరికి అభిమానుల్లో చిన్నపాటి ఆందోళన. అయితే ఇప్పుడు జూనియర్ కొత్త మూవీకి సంబంధించి క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. చాలా రోజుల నుంచి వినిపిస్తున్నట్టే డైరెక్టర్ బాబీ చెప్పిన కథ జూనియర్ కి నచ్చిందని.. బాబీ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ఆల్రెడీ చెప్పుకున్నాం.
అయితే ఈ నెల తొమ్మిదినే ఆ కొత్త మూవీకి కొబ్బరికాయ కొట్టబోతున్నారని తెలుస్తోంది. ఆ వెంటనే మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తైపోయాయట.ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్.. మిగిలిన టెక్నీషియన్స్ వివరాల్ని కూడా షూటింగ్ స్టార్టైన తర్వాత ప్రకటించే అవకాశముంది. కొంచెం టైం తీసుకొన్నప్పటికీ ఫైనల్ గా జూనియర్ మళ్లీ మూవీ మొదలుపెట్టే సరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
