Asianet News TeluguAsianet News Telugu

బ్లాక్ హుడీలో సింపుల్ గా ఎన్టీఆర్.. తారక్ డ్రస్ కాస్ట్ ఎంతంటే..? వైరల్ అవుతున్న న్యూస్

విశ్వక్ సేన్ దమ్కీ ప్రీరిలీజ్ లో బ్లాక్ హుడీలో మెరిసిపోయాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆ లుక్ వైరల్ అవుతుంది. అయితే తారక్ ధరించిన ఈ హుడీ కాస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

NTR New Look Viral In Social Media
Author
First Published Mar 19, 2023, 8:29 AM IST

తమఅభిమాన నటులు ఎవైనా వెరైటీగా డ్రెస్సింగ్ చేసుకున్నా.. కాస్ట్లీ వస్తువలు వాడినా వాటిని వైరల్ చేయడానికి రెడీగా  ఉంటారు ఫ్యాన్స్. ఇక మన టాలీవుడ్ జనాలు అయితే ఈ విషయంలో ఒక అడుగుముందే ఉంటారు. టాలీవుడ్ లో కూడా ఎక్కువగా కాస్ట్లీ వస్తువులు వాడేవారిలో తారక్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు. ఇప్పటికే తారక్ వాడిని చాలా వస్తువలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. కోట్ల విలువ చేసే ఆ వస్తువులను ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.. ఈక్రమంలో  మరో వస్తువు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిత. 

శుక్రవారం విశ్వక్ సేన్ ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చాడు ఎన్టీఆర్. అందరూ తారక్ ను చూస్తూ అలా ఉండిపోయాడు.. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ప్రతీ ఓక్కరిని ఆకర్షించింది. అయితే అందులో కొంత మంది ఫ్యాన్స్ అసలు పని స్టార్ట్ చేశారు. తారక్ ధరించిన హుడీ పై కన్నేశారు. అది  ఏ బ్రాండ్.. ఎంత రేటు ఉంటుంది అంటూ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక దాని గురించి ఇన్ ఫర్మేషన్ బయటకు తీసి.. ఆ షర్ట్ ను సోషల్ మీడియలో వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. అది చూసిన ఫ్యాన్స్ ఆ హుడీ గురించి ఇంకా తెలుసుకోవడం కోసం సెర్చ్ మొదలు పెట్టారు. 

విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం శిల్పకళా వేదికలో జరిగింది. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్  బ్లాక్ హుడీ వేసుకుని వచ్చాడు అది బాగుంది కదా అని దాని రేటు గురించి సెర్చ్ చేయగా.. అది ఇది ఓనిట్సుకా టైగర్ అనే వెబ్ సైట్ లో 170 యూరోస్ కి అందుబాటులో ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 15 వేల వరకూ ఉంది. అయితే విచిత్రం ఏంటీ అంటే.. ఎన్టీఆర్ ఏది కొన్నా కాస్ట్లీగా కొంటారు. ఇప్పటి వరకూ ఆయన కోటి ,రెండు కోట్లు, నాలుగు కోట్ల వాచీలు   ధరించి హైలెట్ అయ్యారు. ఫస్ట్ టైమ్ కాస్త తక్కువ రేటు ఉన్న షర్ట్ ను వేసుకున్నాడని అంటున్నారు ఫ్యాన్స్. 

 ఇక తారక్ వేసుకున్న  ఆ హుడీపై బ్లాక్ అండ్ వైట్‌ షేడింగ్ లో మంటల డిజైన్ ఉంది. ఆ హుడీ ఎంతో యునీక్ గా కనిపించింది. బ్లాక్ కలర్ హుడీపై వైట్ కలర్ లో మంటలు వస్తున్నట్లుగా గ్రాఫిక్ ప్రింట్ ఉంది. ఇది బ్లాక్- ఆరెంజ్ కాంబో కలర్ వేరియంట్ లో ఉంది.ఇక బ్లాక్ హుడీలో ఎన్టీఆర్ లుక్ వైరల్ అవుతోంది. అంతే కాదు తారక్ సింపుల్ గా వచ్చారంటూ ఫ్యాన్స్ మరో ప్రచారం కూడా మొదలు పెట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios