RRR Movie: రక్తపు మరకలు, ఉక్కు కండలతో ఎన్టీఆర్.. మైండ్ బ్లోయింగ్ పోస్టర్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి టాప్ సార్లు స్వాతంత్ర సమరయోధులుగా నటిస్తుండడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్స్ సినిమాపై అంచనాలని తారాస్థాయికి చేర్చాయి. డిసెంబర్ 9న RRR Trailer రిలీజ్ కానుంది. దీనితో ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలైంది. తాజాగా ట్రైలర్ హీట్ పెంచేలా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ కొమరం భీం పోస్టర్ ని చేసింది.
పోస్టర్ లో NTR లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. ఒంటినిండా రక్తపు మరకలతో రెండు తాళ్ళని అరవీరభయంకరంగా ఎన్టీఆర్ లాగుతున్న ఫోజు అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అడవుల్లో ఎలా గడిపాడు, యోధుడిగా ఎలా తయారయ్యాడు అనే సన్నివేసాలు ఉండనున్నాయి.
సాయంత్రం 4 గంటలకు రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు. దీనితో ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఆర్ఆర్ఆర్ చిత్ర సందడి నెలకొంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఇద్దరూ యుక్తవయసులో ఉన్నప్పుడు ఒకే సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ టైం లో వారిద్దరూ కలుసుకుని స్నేహితులుగా మారితే ఎలా ఉంటుంది అనే ఆసక్తికర కల్పిత అంశంతో రాజమౌళి ఈ చిత్రం రూపొందిస్తున్నారు.
అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవ్ గన్,శ్రీయ శరన్.. ఇంగ్లీష్ నటులు అలిసన్ డూడి, రే స్టీవెన్సన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
Also Read: Ram Charan: అనీ మాస్టర్ కు పెద్ద బాధ్యత అప్పగించిన రాంచరణ్
Also Read: Mahesh with NTR: మహేష్ ని తికమకపెట్టిన రెండు ప్రశ్నలు... పాపం హిస్టరీలో పూర్ అనుకుంటా!