Ram Charan: అనీ మాస్టర్ కు పెద్ద బాధ్యత అప్పగించిన రాంచరణ్

షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చిన చరణ్ వెకేషన్స్ కు వెళ్లడం, ఫ్యామిలీ కార్యక్రమాలకు అటెంట్ కావడం లాంటి పనులు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం చరణ్ తన మరదలు వివాహ వేడుక పనులతో బిజీగా ఉన్నాడు.

Ram Charan gives big task to Anee Master

మెగా పవర్ స్టార్ రాంచరణ్ త్వరలో అల్లూరి సీతారామరాజుగా ప్రేక్షకుల పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో చరణ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాగే చరణ్ ప్రస్తుతం మరో దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చిన Ram Charan వెకేషన్స్ కు వెళ్లడం, ఫ్యామిలీ కార్యక్రమాలకు అటెంట్ కావడం లాంటి పనులు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం చరణ్ తన మరదలు వివాహ వేడుక పనులతో బిజీగా ఉన్నాడు. రాంచరణ్ సతీమణి ఉపాసన సోదరి అనుష్పాల వివాహం జరుగుతోంది. పెళ్లి పనులని రాంచరణ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. 

తన మరదలి పెళ్లి కోసం రాంచరణ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ ఫేమ్ Anee Master పై పెద్ద బాధ్యతే పెట్టాడు. సంగీత్ వేడుకలో డాన్స్ పెర్ఫామెన్స్ బాధ్యతని చరణ్ అనీ మాస్టర్ కి అప్పగించారట. ఆమెకు దీనికోసం మంచి పారితోషికమే ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ఈ సంగీత్ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. 

తనకు పని కల్పించిన రాంచరణ్ కు అనీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. రాంచరణ్ తో 15 ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్లు అనీ పేర్కొంది. అనీ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే పిలిచి మరీ చరణ్ ఆమెకు ఈ వర్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

దీనితో అనీ మాస్టర్ సంతోషంగా, ఈ సంగీత్ వేడుకపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది. చరణ్ మరదలి పెళ్లికి మెగా ఫ్యామిలీ మొత్తం అటెంట్ అవుతున్నట్లు తెలుస్తోంది. దోమకొండ కోటాలో ఈ వేడుక జరుగుతోంది. సొంత ఇల్లు కట్టుకోవాలనేది అనీ మాస్టర్ కల. బిగ్ బాస్ 5 తో వచ్చిన పారితోషికం, ఇలా తన వర్క్ తో వచ్చిన పారితోషికంతో మంచి ఇల్లు కట్టుకోవాలని అనీ మాస్టర్ ప్రయత్నిస్తోంది. 

Also Read: Pushpa:‘పుష్ప’నైజాం రైట్స్ దిల్ రాజుకే...ఎంతకంటే

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios