దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా... ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది.

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.57కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా రెండో రోజు కలెక్షన్స్ మరింత డ్రాప్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు ఈ సినిమా రూ.45 లక్షలు వసూలు చేసింది. దీన్ని బట్టి సినిమా పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. 

నైజాంలో రూ.18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.7 లక్షలు, గుంటూరులో రూ.5 లక్షలు, నెల్లూరులో రూ.2 లక్షల షేర్ తో సరిపెట్టుకుంది. రెండు రోజులకు కలిపి ఈ సినిమా వసూలు చేసిన మొత్తం రెండు కోట్లు.

సోమవారం నాటికి ఈ సినిమా పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా పరిస్థితి అలానే ఉంది. ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమా కేవలం లక్ష డాలర్లను మాత్రమే వసూలు చేసింది.