కరోనాని టాలీవుడ్ లో లెక్క చేయటం లేదు. షూటింగ్ లు అయితే వాయిదా వేసారు కానీ...ప్రాజెక్టులు మాత్రం ఓ రేంజిలో సెట్ చేస్తూ హీరోలు బిజిగా ఉన్నారు. ఈ గ్యాప్ ని స్క్రిప్టులు వినటానికి, ప్రాజెక్టులు ఫైనలైజ్ చేయటానికి వినియోగించుకుంటున్నారు. మిగతా హీరోలతో పోటీగా ఎన్టీఆర్ సైతం ఈ కరోనా సమయాన్ని బాగా యుటిలైజ్ చేసుకుంటున్నారు. తను తదుపరి చేయబోయే సినిమాలుకు సంభందించిన స్క్రిప్టులు మెరుగు చేసుకోవటం, సూచనలు,సలహాలతో పాటు మరో ఇద్దరు డైరక్టర్స్ ని ఓకే చేసినట్లు సమాచారం. 

ఇప్పటికే కన్నడ సెన్సేషన్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ ...ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్ని డైరక్ట్ చేయటానికి సైన్ చేసారు. కెజీఎఫ్ మ్యానియాతో తెలుగులోనూ ఈ డైరక్టర్ కు వీరాభిమానులు ఉన్నారు. ఇక  ఈ సినిమా తర్వాత తను ఆల్రెడీ వర్క్ చేసిన సుకుమార్, కొరటాల శివ దర్శకత్వంలో మరోసారి చేయటానికి సిద్దపడుతున్నారు ఎన్టీఆర్. ఈ మేరకు ఆ దర్శకులు ఇద్దరితోనూ మాట్లాడుతున్నారు. వారు చెప్పిన స్టోరీ లైన్స్ వింటున్నట్లు సమాచారం. 

అంటే ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ తర్వాత , త్రివిక్రమ్ తో సినిమా చేస్తారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా ఉండబోతోంది. ఈ మూడు సినిమాలు అయ్యాక, సుకుమార్, కొరటాల శివతో సినిమాలు చేస్తారు. ఈ లోగా ఈ దర్శకులు కూడా వేరే హీరోలతో సినిమాలు చేసి ప్రెష్ గా వస్తారు. మొత్తానికి ఓ లెక్కలో వెళ్తున్నారు ఎన్టీఆర్.