ఎన్టీఆర్‌ సినిమా కోసం అభిమానులు ఎదురు చూసి చూసి కళ్లు కాయలు కాస్తున్నాయి. ఆయన సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ నెలకొంది. అయితే ఎన్టీఆర్‌ హైదరాబాద్‌లో ల్యాండ్‌ కావడం వారికి ఆశలు మొదలయ్యాయి. 

ఎన్టీఆర్‌ సినిమా కోసం అభిమానులు ఎదురు చూసి చూసి కళ్లు కాయలు కాస్తున్నాయి. ఆయన సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ నెలకొంది. అయితే ఎన్టీఆర్‌ హైదరాబాద్‌లో ల్యాండ్‌ కావడం వారికి ఆశలు మొదలయ్యాయి. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత ఎన్టీఆర్‌ నటించాల్సింది కొరటాల శివ దర్శకత్వంలో. సినిమాని ఏడాదిన్నర క్రితమే ప్రకటించారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` విడుదలై కూడా ఏడాది కావొస్తుంది. అయినా ఇప్పటి వరకు కొరటాల చిత్రం స్టార్ట్ కాలేదు. కథలో మార్పులు, పర్‌ఫెక్ట్ బౌండెడ్‌ స్క్రిప్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్ డిలే అవుతున్నట్టు తెలిసింది. 

కథ పరంగా ఫైనల్‌ అయ్యిందని సమాచారం. ఆ మధ్య మ్యూజిక్‌ సిట్టింగ్స్ కూడా జరిగాయి. అనిరుథ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక షూటింట్‌ స్టార్ట్ కావడమే మిగిలింది. ఇంతలోనే తారక్ అమెరికాకి వెకేషన్‌ వెళ్లారు. ఆయన ఫ్యామిలీతో కలిసి డిసెంబర్‌లో వెకేషన్‌కి వెళ్లిన విషయంతెలిసిందే. తాజాగా అది పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు. నిన్ననే(శనివారం) తారక్‌ ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌ వచ్చారు.

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్ లోని ఆయన విజువల్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వారికి ప్రాణాలు లేసి వచ్చినట్టుగా ఉంది. త్వరలోనే ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్ వస్తాయని భావిస్తున్నారు. షూటింగ్‌ డిటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉందని ఎంతో ఆశతో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతుంది. షూటింగ్‌ కూడా గ్యాప్‌ లేకుండా లాంగ్‌ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. 

Scroll to load tweet…

అదే సమయంలో హీరోయిన్‌ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందట. ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ ఫైనల్‌ అయ్యిందని తెలుస్తుంది. ఆమెని చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉందట. ఈ సంక్రాంతికి ఊహించని సర్‌ప్రైజ్‌ రాబోతుందని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. మరి ఆ ప్రకటన ఈ పండక్కి వస్తుందా? లేట్‌ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పతాకాలపై తెరకెక్కనుంది. ఇది వాటర్‌ నేపథ్యంలో రియలిస్టిక్‌ యాక్షన్‌ డ్రామా. ఊహించని విధంగా ఉండబోతుందని తెలుస్తుంది.

ఎన్టీఆర్‌ అమెరికా వెకేషన్‌తోపాటు `ఆర్‌ఆర్‌ఆర్‌`ని గ్లోబల్‌ వైడ్‌గా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వేడుకలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆస్కార్‌ అవార్డు క్యాంపెయిన్‌లోనూ పాల్గొన్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్‌ సాంగ్‌ విభాగాల్లో ఆస్కార్‌ అవార్డు కోసం పోటీ పడబోతుంది. నామినేషన్స్ కోసం `ఆర్ఆర్‌ఆర్‌` టీమ్‌ దర్శకుడు రాజమౌళి, రామ్‌చరణ్‌తోపాటు ఎన్టీఆర్‌ ఈ గ్లోబల్ ప్రమోషన్స్ లో భాగమవుతూ వచ్చారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వేడుకలో తారక్‌ మాట్లాడిన ఇంగ్లీష్‌ వాహ్‌ అనిపించిన విషయం తెలిసిందే.