ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు బుధవారం ప్రపంచం వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ఉదయమే షోలు ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణాలో ఉదయం 7 గంటలకు మొదటి షో ఉంటుందని కొన్ని టికెట్స్ కూడా అమ్మేశారు. అయితే చివరకు ఆ షో క్యాన్సిల్ అయ్యింది. 

అందరితో పాటే ఐమ్యాక్స్ లో ప్రెస్ కి కూడా ఉదయం 8 గంటల తరువాత మొదటి షో స్టార్ట్ కానుంది. ఇక సినిమాకు సంబందించిన స్పెషల్ లో అందరికంటే మొదట ఉదయమే నందమూరి ఫ్యామిలీ చూడనుంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ కి చెందిన నాలుగు తరాల వారికీ ప్రత్యేకంగా కూకట్ పల్లి భ్రమరాంబా థియేటర్ లో మొదటి షోను ప్రదర్శించనున్నారు. ఉదయం 5గంటలకు ఆ షోకి టైమ్ సెట్ చేసినట్లు సమాచారం. 

ఈ షోకు పరిశ్రమలోని ఇతర సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ బయోపిక్ కు కీరవాణి సంగీతం అందించారు.