బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్  సినిమాపై అందరి దృష్టి ఉంది.  తాజాగా ఈ సినిమా షూటింగ్ రెండవ షెడ్యూల్  ప్రారంభమైంది. అందులో  భాగంగా రామ్ చరణ్ కు సంబందించిన యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతున్నాయి. దీంతో కొద్ది రోజులు పాటు మరో హీరోగా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కు దర్శకుడు రాజమౌళి బ్రేక్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ దుబాయికి ఓ చిన్న ట్రిప్ ప్లాన్ చేసారు.

ఇక ఇప్పుడు ట్రిప్ నుంచి తారక్  వెనక్కి హైదరాబాద్  వచ్చారు. అలాగే ఆర్. ఆర్ ఆర్ లో తన పాత్రకు సంబంధించిన కొన్ని కాస్టూమ్స్‌ను కూడా దుబాయ్‌లోనే షాపింగ్ చేసినట్టు తెలిసింది.   గురువారం నుండి తారక్ మళ్లీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారని తెలిసింది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లోనే కీలకమైన సన్నివేశాల షూటింగ్ జరుగుతుందని సమాచారం. 

ఇక రీసెంట్ గా  `హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2019`లో పాల్గొన్న రాజ‌మౌళి తొలిసారి `ఆర్ఆర్ఆర్` గురించి మాట్లాడారు. `ఈ సినిమా `బాహుబ‌లి`కి ఏమాత్రం తీసిపోదు. ఇది కూడా లార్జ్‌స్కేల్ ఉన్న సినిమానే. పాన్ ఇండియా సినిమాగా నిల‌వ‌డానికి పూర్తి అవ‌కాశ‌ముంద`ని రాజ‌మౌళి చెప్పారు.

అలాగే ఎన్టీఆర్ ‘అరవింద సమేత’లో స్లిమ్ లుక్‌లో కనిపించారు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం కొంత బరువు పెరిగి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. మరోవైపు చరణ్ మాత్రం అదే లుక్‌తో దర్శనమిస్తున్నారు.  ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.