Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ "జైలవకుశ" మూవీ రివ్యూ

  • చిత్రం : ‘ జై లవకుశ ‘ (2017)
  • తారాగణం : ఎన్టీఆర్, నివేదా థామస్, రాశిఖన్నా తదితరులు
  • దర్శకత్వం : బాబీ
  • నిర్మాత: కళ్యాణ్ రామ్
  • సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
  • ఆసియానెట్ రేటింగ్ : 3.5/5
ntr jailavakusa movie review

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘జై లవకుశ’. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన హిరోయిన్లుగా  రాశిఖన్నా, నివేదా థామస్ నచించారు, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జై లవ కుశ... ఎన్టీఆర్ మూడు భిన్నమైన పాత్రలలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో ఎన్నడూ చేయాని కొత్తతరహా పాత్రలో ఎన్టీఆర్ కనిపించడంతో ఆ రోల్ లో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడనే ఆత్రుత అభిమానుల్లోనేకాక  యావత్ సినీ ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షక లోకంలో కనిపిస్తోంది. మరి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్టీఆర్ విజయం సాదించాడా లేదా చూద్దాం..

ntr jailavakusa movie review

కథ :

ముగ్గురు కవల అన్నదమ్ములు జై, లవ, కుశ .. జై కి నత్తి ఉండడం తో మిగతా ఇద్దరు సోదరులు జై ను దూరం పెడుతుంటారు. దాంతో తనకు  గుర్తింపునివ్వట్లేదని వారి ఫై పగ పెంచుకుంటాడు జై. ఈ నేపథ్యం లో ఆ ముగ్గురు అన్నదమ్ములు తప్పిపోతారు. ఆ తర్వాత కుశ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అమెరికా వెళ్లి సెటిల్ కావాలనుకుంటాడు..లవ మాత్రం బ్యాంకు జాబ్ చేస్తూ హ్యాపీ గా ఉంటాడు.  జై మాత్రం చిన్న చిన్న నాటకాల్లో రావణ పాత్ర చేస్తూ నిజ జీవితం లో కూడా రావణ గా తయారు అవుతాడు. తనకు గుర్తింపునివ్వని లవకుశలను తనదగ్గరికే రప్పించుకుంటాడు. ఇలా  మళ్లీ ముగ్గురు అన్నదమ్ములు కలుస్తారు..ఆ తర్వాత ఏం జరుగుతుంది..? జై..లవ , కుశ ఫై కోపం తీర్చుకుంటాడా..? జై లైఫ్ లోకి సిమ్రాన్ (నివేద థామస్ ) ఎలా వచ్చిది..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ntr jailavakusa movie review

న‌టీన‌టులు:

సినిమాకు మేజర్ ప్లస్ ఎన్టీఆర్ నటన. మొదటి సారి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి అదరగొట్టాడు. ముఖ్యం గా జై రోల్ లో మరే స్టార్ కూడా చేయలేడు అనే లెవల్లో తన నట విశ్వరూపాన్ని చూపించాడు..కేవలం యాక్షన్ మాత్రమే కాదు సెంటిమెంట్ , లవ్ ట్రాక్ లలో కూడా బాగా చేసాడు. డాన్స్ , ఫైట్స్ , యాక్టింగ్ లో కొత్త ఎన్టీఆర్ ను చూపించారు. అసలు జై పాత్ర కోసం ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డాడో గానీ తెరఫై స్పష్టంగా ఆ కష్టం కనిపిస్తుంది.

ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే రాశిఖన్నా , నివేతా థామస్ ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేసారు. నివేద సెకండ్ హాఫ్ లో జై కి లవర్ గా అద్భుతంగా నటించింది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న ఈమె , ఈ మూవీ లో కాస్త హాట్ గా కనిపించింది.

రాశిఖన్నా మొదటిసారి భారీ బడ్జెట్ సినిమాలో చేసిందని చెప్పాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ పక్కన నటించి లక్కీ అనిపించుకుంది. ఈ మూవీలో ప్రియా పాత్రలో నటించింది. మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలి రోల్ లో కనిపించింది. లవకుమార్ ను ప్రేమించే అమ్మాయిగా అందరి మనసులను దోచుకుంది. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో నందిత , హంస నందిని కనిపించారు. పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి కామెడీ థియేటర్స్ లలో నవ్వులు పూయించింది. విలన్ రోల్ లో అభిమన్యు సింగ్ తనదైన శైలిలో నటించి మెప్పించాడు. పోసాని కూడా తన పాత్రకు తగిన న్యాయం చేసాడు. ఐటెం సాంగ్ లో తమన్నా అందాల ఆరబోత వున్నా.., ఎన్టీఆర్ డాన్సుల ముందు మిల్కీ బ్యూటీ అందాలు తేలిపోయాయి.

ntr jailavakusa movie review

సాంకేతిక విభాగం :

దర్శకుడు బాబీ ఈ సినిమాను అభిమానులకోసమే తీసాడా అనిపిస్తుంది. ఎన్టీఆర్ లోని అసలు సిసలైన నటుడిని బయటకు తీసాడు. సినిమా అంతా ఎన్టీఆర్ భుజాల ఫై నడుస్తుంది. కాకపోతే కథే బాగా రొటీన్ అయ్యింది. అన్నదమ్ములు విడిపోవడం , ఆ తర్వాత కలవడం అనేది సహజంగా చాలా సార్లు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాన్సెప్టే. అలాగే సెకండ్ హాఫ్ కూడా కాస్త సాగదీత కనిపించింది. జై, లవ , కుశ పాత్రలు బాగా అలరించాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. దేవి శ్రీ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. ప్రతి సాంగ్ తో పాటు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా కు ప్రాణం పోశాయి. రావణ సాంగ్ చూస్తుంటే ఒకరకమైన వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఇక చోటా కే . నాయుడు కెమెరా పనితనం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ను చూపించిన విధానం అద్భుతం. లొకేషన్స్ పరంగా ,ఫైట్స్, సెట్స్, హీరో, హీరోయిన్లను ఎంతో అందంగా చూపించి డైరెక్టర్ కథకు ప్రాణం పోశాడు. కోన వెంకట్ ఏం చేస్తాడో అనుకుని భయపడ్డ అభిమానులకు కోన తన స్క్రీన్ ప్లే తో సమాధానమిచ్చాడు.  మధ్య లవ్ ట్రాక్ , కామెడీ జోడించి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ డైలాగ్స్ కూడా అదిరిపోయాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి..మొదటి సారి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించాడు.

ntr jailavakusa movie review

ప్లస్ పాయింట్స్ :

జైలవకుశలో ఎన్టీఆర్ నటన కుమ్మేశాడు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ యాక్టింగ్ అదరహో అనిపించాడు. ఇక ఇంటర్వెల్ బ్లాగ్ ఈ చిత్రానికి మమేజర్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక క్లైమాక్స్, మ్యూజిక్, సినిమాఫోటోగ్రఫి అన్నీ కలిసొచ్చే అంశాలే.

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ మొదట్లో కొంత సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే కథ దృష్ట్యా దర్శకుడు డ్రాగ్ చేయకతప్పలేదనిపిస్తుంది. కత్తెరకు మరికాస్త పని చెప్పి వుంటే అద్భుతంగా వుండేది.

చివరిగా : జై లవకుశ… నందమూరి అభిమానులకు దసరా బొనాంజాయే.

ntr jailavakusa movie review

 

Follow Us:
Download App:
  • android
  • ios