ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జైలవకుశ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. నెగేటివ్ షేడ్స్ తో కూడిన నాయకత్వ పాత్రలో రావణుణ్ణి గుర్తుచేస్తూ జై పాత్రలో తారక్ నటన  మరో పాత్రలో లవుడు ఒక గా బ్యాంక్ ఉద్యోగిగా, ఇంకో పాత్రలో కుశుడు దొంగగా నటించి హాస్యం పండించారు. ఒకే సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో వెంటవెంటనే కనిపించి ప్రేక్షకులను తన నటనా శైలితో మెప్పించిన ఎన్.టి.ఆర్ ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలకు మించి పర్ పామ్ చేశారు. ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టుగానే తొలివారం కూడా గడవక ముందే ముచ్చటగా మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా "వంద కోట్ల క్లబ్" లో చేరి సంచలనం సృష్టించింది. 

 

రాశీ ఖన్నా, నివేదా థామస్ తమ అందాలను ఆరబోస్తూ, జూనియర్ తో స్క్రీన్ పంచుకున్న ఈ సినిమాలో జై గా తారక్ విలనిజం ఒక సంచలనంగా మారింది. నాటి నందమూరి తారక రామారావుకు కాథానాయక పాత్రలతోపాటు ప్రతినాయక పాత్రలను సమానంగా నటించి మెప్పించిన ప్రత్యేకతను తారక్ గుర్తుచేస్తూ నటించటం ఘనవిజయం సాధించటం ఆయన్ ఫాన్స్ కు దసరా పండగ ముందేవచ్చినట్లైంది. 

 

సినిమా పరిశ్రమలో జూనియర్ నందమూరి తారక రామారావుకు మహాభారతం లో కర్ణునికి ఉన్నంత నెగెటివ్ ప్రచారం ఉంది. సమర్ధుడైనా శాపాల మాటున ధీరత్వం తో జీవించిన వాడు కర్ణుడు. ఆయన ధీరత దానశీలతను ఎవరూ ప్రశ్నించ లేని విధం గా ఆయన ప్రవర్తించారు. అలాగే జూనియర్ సామర్ధ్యం కూడా. ఎంత నెగెటివ్ ప్రచారమున్నా, జై లవ కుశ మూడురోజుల్లో వంద కోట్లు మార్క్ అతి సునాయాసంగా దాటేసి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు.