ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవకుశ జై లవకుశ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు బాబీ సౌత్ కొరియా మూవీ నుంచి కాపీ కొట్టారని ఆరోపణలు
ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పై తెరకెక్కుతున్న చిత్రం జైలవకుశ. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ఆడియో మరో రెండ్రోజుల్లో... రిలీజ్ చేయనున్నారు. ఇక సెప్టెంబర్ 10న ట్రైలర్ లాంచ్ చేసి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బాబీపై కాపీ క్యాట్ ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి తరహాలో బాబీ కూడా వేరే లాంగ్వేజ్ సినిమా నుంచి కాపీ కొట్టి జైలవకుశ తీస్తున్నాడని తెలుస్తోంది. ఓ సౌత్ కొరియా మూవీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. ది గుడ్ ది బ్యాడ్ ది వియర్డ్ అనే చిత్రం ఆధారంగాననే జైలవకుశ తెరకెక్కిస్తున్నాడని సమాచారం.
అయితే ఇదంతా వట్టిదేనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా జైలవకుశలో రాశిఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు.
