బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, చాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌లపై ఎన్టీఆర్‌ ప్రశంసలు కురిపించారు. వారిని ఆకాశానికి ఎత్తేశారు. గ్లోబల్‌ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR).. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌(Amitabh), రణ్‌బీర్‌ కపూర్‌(RanBir Kapoor), అలియాభట్‌, నాగార్జును(Nagaruna)లపై ప్రశంసలు కురిపించారు. `బ్రహ్మాస్త్ర`(Brahmastra) ఈవెంట్‌లో గెస్ట్ గా పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో తారక్‌ మాట్లాడుతూ ముందుగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అనంతరం ఆయన ఇంకా మాట్లాడుతూ, ఇండియన్‌ సినిమాలో చాలా మంది నటులున్నారు. కాని కొంత మంది నటులు మాత్రమే నటుడిగా తమ మార్క్ ని చూపిస్తారు. అలా నేను అమితాబ్‌ బచ్చన్‌ ఇంటెన్సిటీని బాగా ఎంజాయ్‌ చేస్తాను. ఆయన ఇంటెన్సిటీకి నేను పెద్ద అభిమానిని. ఆయన వాయిస్‌, ఆయన కళ్లు, ఆయన నిలబడే విధానం, ఆయన నడక, ఎడమ చేయి తిప్పే విధానం, ఆయనకు సంబంధించిన ప్రతిదీ నాకు చాలా ఇష్టం. ఆయన నిజంగా ఒక మార్క్ ని క్రియేట్‌ చేశారు. 

ఆయన తర్వాత నేను బాగా కనెక్ట్ అయ్యింది రణ్‌ బీర్‌ నటనకు. ఆయన నటించిన ప్రతి సినిమా నన్ను నటుడిగా చాలా ఇన్‌స్పైర్‌ చేస్తాయి. రణ్‌బీర్‌ నటించిన చిత్రాల్లో నా మోస్ట్ ఫేవరేట్‌ `రాక్‌స్టార్‌`. అందులోని పాటలు ఇప్పటికీ వింటూ ఉంటాను. అందులో రణ్‌ బీర్‌ ఇంటెన్సిటీ అద్భుతంగా ఉంటుంది. నాపై అవి చాలా ప్రభావాన్ని చూపాయి. ఆయనతో ఇలా మా హైదరాబాద్‌లో స్టేజ్‌ షేర్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రణ్‌బీర్‌ జర్నీ బ్రహ్మాస్త్రతో ఆగదు. ఇందులో మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నా.

అలియాభట్‌ ఇండియాలోని ఫైనెస్ట్ యాక్టర్‌లో ఒకరు. నేను నా ఎమోషన్స్ షేర్‌ చేసుకుంటారు. రాజమౌళితో, నాగార్జున బాబాయ్‌తో, ఆ తర్వాత అలియాతోనే. ఆమెతో `ఆర్‌ఆర్‌ఆర్‌`లో కలిసి నటించాను. ఆమె జెమ్‌ పర్సన్‌. డార్లింగ్‌. ఆమె కెరీర్‌లో ఈ చిత్రం మరో గొప్ప మైలురాయిలాంటి చిత్రమవుతుంది. కరణ్‌ సర్‌.. ఇండియన్‌ సినిమాని ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక భూమిక పోషిస్తారు. ఆయనకు నా అభినందనలు. ఈ చిత్రంతో ఆయన కూడా మరో మైలు రాయికి చేరుకుంటారని ఆశిస్తున్నా. 

ఈ ఈవెంట్‌కి దర్శకుడు అయాన్‌ ముఖర్జీ రాలేదు. కానీ ఆయన సినిమా కోసం చివరి నిమిషం వరకు తపిస్తున్నారని భావిస్తున్నా. రాజమౌళి కూడా అలానే చేస్తారు. ఇరవై ఏళ్లు గారాబంగా పెంచుకున్న కూతురికి పెళ్లి చేసి పంపించినట్టే ఉంటుంది. రాజమౌళికి కూడా అలాగే ఉంటుంది. సినిమాని రిలీజ్‌కి చివరి నిమిషం వరకు ఓ భయం ఉంటుంది.ప్రస్తుతం అయాన్‌ కూడా అదే ఫీలింగ్‌లో ఉన్నారనుకుంటున్నా. 

నాగార్జున బాబాయ్‌ హిందీలో నటించిన `కుదా గవా` సినిమా నాకు చాలా ఇష్టం. ఒక తెలుగు యాక్టర్‌ హిందీ సినిమా చేసి అందులో ఎలా హిందీ మాట్లాడితే ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ ఉండేది. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. నటుడిగా, స్టార్‌గా ఆయన గురించి చెప్పే ఏజ్‌ నాది కాదు. ఈ చిత్రంలోనూ ఆయన హిందీలో డైలాగ్‌లు చెప్పి ఉంటారని భావిస్తున్నా. 

ఇప్పుడు ఇండియన్‌ సినిమా సెలబ్రేట్‌ చేసుకునే టైమ్‌కి వచ్చాం. గ్లోబల్‌ సినిమా కూడా ఇప్పుడు చాలా ప్రెజర్‌కి ఫీలవుతుంది. ఎందుకంటే ఇంకా కొత్తగా ఏదో కావాలి. ఇప్పుడిస్తున్న దానికంటే ఇంకా ఏదో కొత్తగా కావాలి. నటుడిగా మనలో ఆ ప్రెజర్‌ ఉండాలి. అది ఉంటేనే మనం గుడ్‌ గ్రేట్‌ సినిమాలను ఆడియెన్స్ కి ఇవ్వగలుగుతాం. ఈ ఛాలెంజ్‌ని అందరు యాక్సెప్ట్ చేస్తారని నమ్ముతున్నా.