ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మళ్లీ నిరాశ తప్పదా? `ఎవరు మీలో కోటీశ్వరులు` లేనట్టేనా?
`ఎవరు మీలో కోటీశ్వరులు` షో మే నెలలో ప్రారంభమవుతుందన్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో షా వాయిదా పడింది. షూటింగ్‌లన్నీ నిలిచిపోవడం, లాక్‌డౌన్ వంటవన్నీ ఈ షోపై ప్రభావాన్ని చూపాయి.
ఎన్టీఆర్ హోస్ట్ గా `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షో ప్రసారం కానున్న విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం ఈ షోని అధికారికంగా ప్రకటించారు. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ఆడిషన్స్ కూడా దాదాపు పూర్తయ్యింది. మే నెలలో షో ప్రారంభమవుతుందన్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో షా వాయిదా పడింది. షూటింగ్‌లన్నీ నిలిచిపోవడం, లాక్‌డౌన్ వంటవన్నీ ఈ షోపై ప్రభావాన్ని చూపాయి.
అయితే ఈ షో జూన్‌లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది. తాజాగా ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కి మరోసారి షాక్ ఇచ్చారు. ఈ షో ఇప్పట్లో ప్రారంభమయ్యే ఛాన్స్ లేదని చెబుతున్నారు. నిజానికి ఎన్టీఆర్‌ని చూడక మూడేళ్లవుతుంది. చివరగా ఆయన `అరవింద సమేత`లో నటించారు. ఆ తర్వాత `ఆర్‌ఆర్‌ఆర్`లో లాక్ అయ్యారు. ఆ సినిమా రావడానికి అక్టోబర్ వరకు వెయిట్ చేయాలి. ఆ లోపు `ఎవరు మీలో కోటీశ్వరుడు` షోతోనైనా ఎన్టీఆర్‌ని చూడొచ్చు అనుకున్నారు. కానీ వారి ఆశలపై కరోనా నీళ్లు చల్లుతూనే వస్తుంది.
తాజాగా సమాచారం మేరకు ఈ షోని ఆగస్ట్ వరకు వాయిదా వేసినట్టు టాక్. ఆ సమయానికి కరోనా ఉధృతి తగ్గే అవకాశం ఉందని, ఆ టైమ్‌లో షోని రన్ చేసుకోవచ్చు అని నిర్వహాకులు భావిస్తున్నారు. ఒకవేళ ఆ టైమ్‌కి కూడా సాధ్యం కాకపోతే, కరోనా తగ్గకపోతే ఈ ఏడాది మొత్తం షోని నిర్వహించకూడదనే సెకండ్ థాట్‌లో కూడా నిర్వహకులు ఉన్నారని టాక్. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కిది, `ఎవరు మీలో కోటీశ్వరులు` అభిమానులకు నిరాశ తప్పదనే అంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్`లో నటిస్తున్నారు. త్వరలో కొరటాల శివతో సినిమాని ప్రారంభించబోతున్నారు.