యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డుల తో ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నారు. కొమరం భీమ్ జయంతి సంధర్భంగా అక్టోబర్ 22న ఆర్ ఆర్ ఆర్ నుండి విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో రికార్డుల దుమ్ముదులుపుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆవేశం, ఆక్రోశంతో కూడిన ఎన్టీఆర్ లుక్ మరియు విజువల్స్ పతాక స్థాయిలో ఉన్నాయి. 

ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్స్ దక్కించుకున్న టీజర్ గా రికార్డు సృష్టించిన ఈ టీజర్, వేగంగా లక్ష కామెంట్స్ సాధించి మరో రికార్డు అందుకోవడం జరిగింది. తాజాగా కొమరం భీమ్ ఫస్ట్ లుక్ వీడియో 30మిలియన్ వ్యూస్ అందుకుంది. టాలీవుడ్ నుండి వేగంగా ఈ మార్క్ చేరుకున్న టీజర్ గా సరికొత్త రికార్డు ఎన్టీఆర్ నెలకొల్పాడు. 

దివాళి సంధర్భంగా ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కి రికార్డ్స్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ని వెండితెరపై చూసి రెండేళ్లు దాటిపోయింది. ఆయన చివరి చిత్రం అరవింద సమేత వీరరాఘవ 2018 అక్టోబర్ లో విడుదల కావడం జరిగింది. ఎన్టీఆర్ ని వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతతో ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదల లేటైనా, కొమరం భీమ్ టీజర్ సక్సెస్  వారికి ఉపశమనం కలిగించే అంశం. 

ఇక ఇటీవలే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలుపెట్టారు. వీలైనంత త్వరగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్  గా నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.