Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ ఫొటో మార్ఫింగ్‌ ...టీవీ ఛానెల్ పై ఫ్యాన్స్ బోయ్ కాట్ ట్రెండ్

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాలు,పొలిటికల్ కెరీర్ ల  మీద ఓ న్యూస్ ఐటెం చేసి ప్రసారం చేసారు. అందులో పవన్ కళ్యాణ్ ఫొటో లో ఎన్టీఆర్ ని మార్ఫింగ్‌ చేసింది ఉంది. 

NTR fans trending Boycott TV channel as they have posted morphed pic of NTR
Author
First Published Jun 5, 2023, 9:40 AM IST


ఒక్కోసారి చిన్న  పొరపాటు అతి పెద్దదై కూర్చుంటుంది. హడావిడిలో చూసి చూడకుండా చేసినవి మన మెడకే చుట్టుకుంటాయి. అలాంటి సమస్యే ఇప్పుడు తెలుగు పాపువర్ టీవి ఛానెల్ కు ఎదురైంది. ఆ టీవి ఛానెల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు ఆ ఛానెల్ ని బోయకాట్ చేయమని పిలుపు ఇస్తున్నారు. ఇంతకీ ఏమి జరిగిందీ అంటే.... ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాలు,పొలిటికల్ కెరీర్ ల  మీద ఓ న్యూస్ ఐటెం చేసి ప్రసారం చేసారు. అందులో పవన్ కళ్యాణ్ ఫొటో లో ఎన్టీఆర్ ని మార్ఫింగ్‌ చేసింది ఉంది. అది గమనించకుండా ఆ ఫొటోని పోగ్రామ్ లో వాడేసారు. ఇప్పుడు అదే పెద్ద వార్త అయ్యి కూర్చుంది. వెంటనే క్షమాపణ చెప్పాలని ఆ టీవి ఛానెల్ ని కోరుతూ , అప్పటిదాకా బోయ్ కాట్ చేయమని తోటి అభిమానులకు పిలుపు ఇస్తున్నారు. 

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయాలకు వస్తే...ఎన్టీఆర్  హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించనున్న తాజా సినిమా ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. ఆల్రెడీ ఇప్పటికే విడుదల చేసిన సినిమా అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించింది. ''అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని! అప్పుడు భయానికి తెలియాలి... తాను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా'' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయ్యింది.  ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా   అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, విలన్ గా  పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. చిత్ర బృందం అధికారికంగా ఈ  విషయం ప్రకటించింది.

హీరోగా ఎన్టీఆర్ 30వ సినిమా ఇది. అందుకని #NTR30 గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఓ కల్పిత దీవి, పోర్టు నేపథ్యంలో తెరకెక్కుతోందట. కథా నేపథ్యం ఈ ట్వంటీయెత్ సెంచరీ కాదని సమాచారం. సెమీ పీరియడ్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేశారట కొరటాల శివ.  వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుందని, సీజీ అవసరం అయ్యే సన్నివేశాలను ముందు షూట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్లాన్ చేశారని వినిపిస్తోంది.

నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు.  

Follow Us:
Download App:
  • android
  • ios