Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళిని అవమానించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్... ఇప్పుడేం సమాధానం చెప్తారు!


ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళికి క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. రాజమౌళిని అంతగా అవమానించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారని అంటున్నారు.  ఎన్టీఆర్ కి రాజమౌళి ఎలాంటి అన్యాయం చేయలేదంటున్నారు.

ntr fans should apologize director rajamouli for blaming unnecessarily
Author
First Published Aug 19, 2022, 1:28 PM IST

ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి రాజమౌళి విమర్శలు ఎదుర్కొన్నారు. సినిమాలో రామ్ పాత్రను ఎలివేట్ చేసిన రాజమౌళి భీమ్ పాత్రకు సరైన న్యాయం చేయలేదని గగ్గోలు పెట్టారు. పాత్రల ప్రాధాన్యతపరంగా, నిడివిపరంగా కూడా ఎన్టీఆర్ ని చరణ్ డామినేట్ చేశాడన్న వాదన వినిపించింది. ముంబైలో జరిగిన సక్సెస్ మీట్ లో ఇదే ప్రశ్నను ఓ విలేకరి లేవనెత్తడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో రాజమౌళిని టార్గెట్ చేశారు. ఆయన్ని సోషల్ మీడియాలో దూషించారు. ఆయనకు నేరుగా అసభ్యకర పదజాలంతో సందేశాలు కూడా పంపినట్లు వార్తలు వచ్చాయి. 

ఓ ప్రక్క ఆర్ ఆర్ ఆర్(RRR Movie) లో ఎన్టీఆర్ సైడ్ హీరో అంటూ చరణ్ ఫ్యాన్స్ ఎగతాళి చేయడం కూడా వాళ్ళ ఆగ్రహం హద్దులు దాటడానికి కారణమైంది. అలాగే ఆర్ ఆర్ ఆ రైటర్ విజయేంద్రప్రసాద్ ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ పాత్ర చాలా కష్టం, కాంప్లెక్సిటీ ఉన్న రోల్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే వాస్తవంలో చరణ్ కంటే కూడా ఎన్టీఆర్ కే రాజమౌళి ప్రాధాన్యత ఇచ్చారని, భీం పాత్ర ఆయన డిజైన్ తీరు హాలీవుడ్ మేకర్స్ ని ఆకర్షించినట్లు తెలుస్తుంది. 

ప్రముఖ మ్యాగజైన్ ది వెరైటీ ఇటీవల ఆస్కార్ 2023 అంచనా లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ చోటు దక్కించుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటనకు గాను ఎన్టీఆర్(NTR) ఆస్కార్ గెలుచుకునే అవకాశం కలదని వెరైటీ మ్యాగజైన్ తెలియజేసింది. అప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. మరోవైపు రాజమౌళి ఎన్టీఆర్ కి చేసిన మంచిని మరచి అపార్ధం చేసుకొని దూషించినందుకు బాధపడుతున్నారు. 

తొందరపాటుతో రాజమౌళిని అనరాని మాటలు అన్నందుకు వారు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తుంది. అందుకే కదా అంటారు... కాలు జారితే తీసుకోగలం కానీ మాటజారితే తీసుకోలేమని. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరిస్థితి ఇప్పుడు అలానే తయారైంది. అకారణంగా రాజమౌళిని తిట్టి అబాసుపాలయ్యారు. ఎన్టీఆర్ తో రాజమౌళికి ఉన్న అనుబంధం ఏమిటో, వాళ్ళ కంబినేషన్ లో వచ్చిన విజయాలు మరచి ప్రవర్తించారు. నిజం నిలకడమీద తెలుస్తుందని, ఆర్ ఆర్ ఆర్ ద్వారా ఎన్టీఆర్ కి రాజమౌళి చేసిన మంచి ఏమిటో లేటుగా తెలిసింది. 

అయితే  ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోని ఒకవర్గం అప్పట్లోనే దాన్ని ఖండించారు. రాజమౌళి(Rajamouli) ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారు. ఒకరు ఎక్కువ మరొక తక్కువ అనే విశ్లేషణలు వ్యర్థమన్న అభిప్రాయం వెల్లడించారు. సహనం లేని ఫ్యాన్స్ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios