త్వరలో ఎన్నికలు వస్తున్నాయి. మా సపోర్ట్ మీకు ఉండదంటూ... ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవన్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ నందమూరి-మెగా అభిమానులను దగ్గర చేస్తుందనుకుంటే అంతకంతకు దూరం చేస్తుంది. ఎవరు గొప్ప అనే చర్చ తెరపైకి రావడంతో మరింత మంట రేగింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుండే ఈ చర్చ మొదలైంది. ఎన్టీఆర్ ని రాజమౌళి తగ్గించేశాడని ఒక వర్గం ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి రాజమౌళికి అసభ్యకర సందేశాలు, వేధింపులు కూడా ఎదురయ్యాయని సమాచారం.
అయితే అంతర్జాతీయంగా వేదికల్లో ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ది వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు చేర్చింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆరే గొప్ప, మా వాడిది ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మన్స్ అంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు. ఒక దశలో ఎన్టీఆర్ ఆస్కార్ కి నామినేట్ అవుతాడంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఎన్టీఆర్ కి నామినేషన్ దక్కలేదు.
అయితే ఆస్కార్ వేడుకకు ముందు రామ్ చరణ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. గుడ్ మార్నింగ్ అమెరికా షోకి హాజరయ్యారు. ఈ ఘనత అందుకున్న మొదటి ఇండియన్ హీరోగా రికార్డులకు ఎక్కాడు. అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ఈవెంట్ కి రామ్ చరణ్ అతిథుల్లో ఒకరిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఒక అవార్డు ప్రదానం చేశారు. అలాగే స్పాట్ లైట్ అవార్డుతో సత్కరించబడ్డారు. హాలీవుడ్ మీడియాతో పాటు ఇండియా మీడియా రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఆర్ ఆర్ ఆర్ అంటే రామ్ చరణ్ అన్నట్లు పరిస్థితి మారింది. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తీవ్ర అసహనానికి గురి చేసింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఒక లెటర్ హెడ్ వాళ్ళ కోపాన్ని రెట్టింపు చేసింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వేడుకలో విశిష్ట గౌరవం పొందిన రామ్ చరణ్ ని అభినందిస్తూ పవన్ కళ్యాణ్ లెటర్ హెడ్ విడుదల చేశారు. రామ్ చరణ్ తో పాటు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని అభినందించిన పవన్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదు. దీంతో పవన్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అదే సమయంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నీకు మా సప్పోర్ట్ ఉండదని పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
దీనికి సంబంధించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇది మెగా-నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవకు కారణమైంది. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫ్యాన్ వారు సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు. కాగా మార్చి 12న ఆస్కార్ ఈవెంట్ జరగనుంది. ఆరోజు ఆర్ ఆర్ ఆర్ భవితవ్యం తేలనుంది.
