మళ్లీ బాలయ్యది అదే తీరు.. ఫైర్ అవుతున్న అభిమానులు

NTR fans angry on balayya
Highlights

మళ్లీ బాలయ్యది అదే తీరు.. ఫైర్ అవుతున్న అభిమానులు

బాలక్రిష్ణకు ఎన్టీఆర్ ప్రతిష్ఠాత్మక చిత్రం. ఆయనే నటిస్తూ నిర్మిస్తూ చేస్తున్న చిత్రం కాబట్టి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో హరిక్రిష్ణ ముఖ్య పాత్ర పోషించాడన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్ర సినిమాలో కీలకం. ఈ పాత్రలో కళ్యాణ్‌ రామ్‌ కనిపించబోతున్నాడన్నది ఇప్పుడు ఫిలింనగర్ లోగుసగుసలాడుతున్నారు. ఎన్టీఆర్‌ అధికారంలోకి రావటానికి ఎన్నికల సమయంలో చేపట్టిన చైతన్య రథం ఓ కారణం.ఆ రథాన్ని నడిపింది ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణే. దీంతో ఈ పాత్రకు కళ్యాణ్‌ రామ్‌ అయితేనే బావుంటుందన్న ఆలోచనతో ఆ నందమూరి హీరోను మేకర్లు సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక చిత్ర లాంఛింగ్‌కు కళ్యాణ్‌ రామ్‌ హాజరుకావటం.. పైగా తన తండ్రి పాత్రే కావటంతో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మరోవైపు నారా రోహిత్‌, తారకరత్నలకు కూడా ఈ చిత్రంలో పాత్రలు దక్కాయని ఆ కథనం వివరించింది. 

అయితే ఈ సినిమాకి తారక్ ని కావలనే దూరం పెడుతున్నారని తెలుస్తోంది. నందమూరి ఫ్యామిలీ ఒంటి చేత్తో నడిపిస్తున్న తారక్ మీద బాలయ్య ఎందుకంత చిన్నచూపు. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ పేరు ప్రఖ్యాతలని దశ దిశలా వ్యాపింపచేస్తున్న ఒకే ఒక్కడు ఈ చిన్నరాముడు.బాలయ్య చేసే మాస్ రొట్టు కొట్టుడు చిత్రాలకు జనాలు ఎప్పుడో స్వస్తి పలికారు. బాలయ్య ఇప్పటికైనా మేలుకో నీ ఇంట్లోనే కోహినీరు వజ్రాన్ని పెట్టుకొని నిర్లక్ష్యం చేసుకుంటున్నావని అభిమానులు సామాన్య ప్రేక్షకుల మనోవేదన. అయితే ఈ ప్రాజెక్టు లాంఛింగ్‌ సమయంలో తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని మొన్నీమధ్యే ఐపీఎల్‌ ఈవెంట్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పష్టత ఇచ్చేశాడు. దీంతో ‘ఎన్టీఆర్‌’లో తారక్‌కు ఛాన్స్‌ దక్కే అవకాశం లేదన్నది తేలిపోయింది. నేటి నుంచి ఎన్టీఆర్‌ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటుంది.. దసరాకు చిత్రం విడుదల కానుంది.

loader