సెల్ఫీ అడిగితే మొబైల్ లాక్కొని విసిరేసి జనాలున్నారు. కోపం అందరికి ఉంటుంది. కానీ అభిమానులను అర్ధం చేసుకునే గుణం కొంత మందికే ఉంటుంది. ఆ లిస్ట్ లో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. ఎందుకంటే ఎంతో బిజీగా అలసిపోయి ఉన్న చరణ్ ఓ వ్యక్తి సెల్ఫీ అడగ్గానే నవ్వుతూ ఒకే చెప్పేశాడు. అయితే ఆ వ్యక్తి రామ్  చరణ్ అభిమాని కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఎంత స్నేహంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్య ఇద్దరి హీరోల అభిమానులు కూడా చాలా ఫ్రెండ్లిగా ఉంటున్నారు. ఇద్దరి హీరోలని సమానంగా అభిమానిస్తున్నారు. 

అదే తరహాలో ఎన్టీఆర్ ఫ్యాన్ హైదరాబాద్ విమానాశ్రమంలో చరణ్ ని చూసి సెల్ఫీ అడిగాడు. పక్కన ఉపాసన - లగేజ్ ఉన్నా ఏ మాత్రం ఆలోచించలేదట. పైగా నైట్ మొత్తం ట్రావెల్ చేసి కొంచెం అలసిపోయి ఉన్నా కూడా చరణ్ తన వ్యక్తిగతం గురించి ఆలోచించకుండా ప్రేమతో వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్ ని ఖుషి చేశాడట. ఈ విషయాన్ని ఆ అభిమాని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మొత్తానికి చరణ్ భలే సింపుల్ అండ్ కూల్ మనిషి అంటూ అందరూ పొగుడుతున్నారు.