`ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత ఎన్టీఆర్‌.. కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్‌30 చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఇది ప్రారంభం కాగా, ఎన్టీఆర్‌ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఇందులో జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుంది. కోస్టల్‌ ఏరియాలోని ఓ ఐలాండ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అంతర్జాతీయ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్‌ వినిపిస్తుంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. తారక్‌ తన అభిమానులు డబుల్‌ ట్రీట్‌ ప్లాన్‌ చేశారట. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ డబుల్‌ రోల్‌ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. గతంలో డబుల్‌ రోల్‌, త్రిబుల్‌ రోల్‌ చేశారు ఎన్టీఆర్‌. `ఆంధ్రావాలా`, `అదుర్స్` చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. `జై లవ కుశ`లో ఏకంగా త్రిబుల్‌ రోల్‌ చేసి మెప్పించారు. ఇప్పుడు `ఎన్టీఆర్‌30`లోనూ తారక్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. 

ఇక సినిమాలో ఆయన తండ్రి కొడుకులుగా కనిపిస్తారట. ఈ రెండు పాత్రలతో కథ కూడా రెండు భిన్నమైన షేడ్స్ లో సాగుతుందని తెలుస్తుంది. టీజర్‌లో ఇప్పటికే భయానికే భయం పెట్టించేలా తారక్‌ పాత్ర ఉంటుందని చెప్పారు. భయం లేని జనాలకు భయాన్ని పుట్టించే పాత్రలో యంగ్‌ టైగర్‌ కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. అంతటి పవర్‌ఫుల్‌గా ఎన్టీఆర్‌ పాత్ర ఉంటుందని సమాచారం.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ డబుల్‌ రోల్‌ చేసిన `ఆంధ్రావా`, `శక్తి` చిత్రాలు పరాజయం చెందాయి. `అదుర్స్` హిట్‌ కాగా, `జైలవకుశ` పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు మరోసారి డబుల్‌ రోల్‌ అంటే, అది కూడా రెండు భిన్నమైన షేడ్స్ లో సాగే పాత్రలని తెలుస్తుంది. మరి ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలో నిజమెంతా అనేది మున్ముందు స్పష్టత రానుంది. కానీ ఈ వార్త తారక్‌ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ నిస్తుందని చెప్పొచ్చు.