Asianet News TeluguAsianet News Telugu

Devara:ఎన్టీఆర్ 'దేవర' ఆడియో రైట్స్ కి మైండ్ బ్లోయింగ్ డీల్.. ధర ఎన్ని కోట్లంటే, సెకండ్ హైయెస్ట్..

ఎన్టీఆర్ దేవర చిత్రానికి ఎలాంటి క్రేజ్ ఉందో ఆడియో రైట్స్ కి కుదిరిన డీల్ గురించి తెలిస్తే అర్థం అవుతుంది. 

 

NTR Devara movie Music rights sold for Huge amount dtr
Author
First Published Nov 8, 2023, 3:44 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. యుదసుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్ పైఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని ప్రారంభించే సమయంలో కొరటాల శివ మాట్లాడుతూ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది అని ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశారు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని కొరటాల శివ పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ దేవర చిత్రానికి ఎలాంటి క్రేజ్ ఉందో ఆడియో రైట్స్ కి కుదిరిన డీల్ గురించి తెలిస్తే అర్థం అవుతుంది. 

దేవర చిత్ర ఆడియో రైట్స్ ని ఓ ప్రముఖ సంస్థ రూ 27 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇది దిమ్మతిరిగే ధర అనే చెప్పాలి. రీసెంట్ తెలుగు చిత్రాల్లో టాప్ ప్లేస్ లో ఈ ఆడియో డీల్ కూడా ఉంటుంది. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్ర ఆడియో రైట్స్ 45 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్ర ఫస్ట్ పార్ట్ ఆడియో ఇండియా వైడ్ గా సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ కి కలసి వచ్చింది. పుష్ప 2 తర్వాత దేవర ఆడియో రైట్స్ డీల్ లో సెకండ్ హైయెస్ట్ గా నిలిచింది అని అంటున్నారు. 

ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అనిరుద్ విక్రమ్, జైలర్, లియో లాంటి క్రేజీ చిత్రాలకు సంగీతం అందించాడు. ఆ చిత్రాలన్నీ ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడం, పైగా అనిరుద్ సంగీతం కావడంతో దేవర చిత్ర ఆడియో రైట్స్ బాంబులా పేలాయి. 

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆడియో రైట్స్ విషయంలో గతంలో ఆర్ఆర్ఆర్, ఆదిపురుష్ సంచలనం సృష్టిస్తే ఇప్పుడు పుష్ప 2, దేవర చిత్రాలకు అంతకి మించి బిజినెస్ జరిగింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios