Devara: ప్రభాస్, అల్లు అర్జున్‌లను ఫాలో అవుతున్న ఎన్టీఆర్.. రెండు భాగాలుగా `దేవర`..
ప్రస్తుతం `పుష్ప` రెండు భాగాలు రాబోతుంది. `సలార్` కూడా రెండు భాగాలే. ఇప్పుడు ఆ జాబితాలో `దేవర` చేరింది. ఈ లెక్కన ప్రభాస్, బన్నీలను ఎన్టీఆర్ కూడా ఫాలో అవుతున్నాడు.

ఒకప్పుడు `సక్వెల్` చిత్రాల ట్రెండ్ నడిచేది. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఊపందుకుంది. రెండు భాగాల ట్రెండ్ నడుస్తుంది. `బాహుబలి`తో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పుడు పీక్ కి చేరుకుంటుంది. ఇప్పటికే `కేజీఎఫ్` రెండు భాగాలుగా వచ్చింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. `పొన్నియిన్ సెల్వన్` రెండు భాగాలుగా వచ్చింది. అలాగే ప్రస్తుతం `పుష్ప` రెండు భాగాలు రాబోతుంది. `సలార్` కూడా రెండు భాగాలే. ఇప్పుడు ఆ జాబితాలో `దేవర` చేరింది. ఈ లెక్కన ప్రభాస్, బన్నీలను ఎన్టీఆర్ కూడా ఫాలో అవుతున్నాడు.
తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. `దేవర` చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్టు తెలిపారు. బిగ్ కాన్వస్‌పై భారీ స్కేల్‌లో సినిమాని తెరకెక్కిస్తున్నామని, రాను రాను ఈ సినిమా రేంజ్ పెరిగిపోతుందని, ఒక భాగంలో ఈ చిత్ర కథని చెప్పడం కష్టమవుతుందని, అందుకే రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్టు తెలిపారు. సినిమా కథలో మార్పు లేదని, కానీ కాన్వాస్ మాత్రం పెరిగిపోతుందన్నారు. ఒక్క సినిమాగా దీన్ని తీసుకురావడం కష్టమని, పర్‌ఫెక్ట్ గా చెప్పాలంటే రెండు భాగాలుగా చేయడం బెటర్ అనిపించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
కోస్టర్ ఏరియాలో ఇప్పటి వరకు బయటకు రానటువంటి, సినిమాలో చూపించనటువంటి ఓ కథని `దేవర` చిత్రంలో తాము చెప్పబోతున్నామని దర్శకుడు కొరటాల వెల్లడించారు. సినిమా ఎలా ఉంటుందో ఇప్పటికే పోస్టర్స్ ద్వారా వెల్లడించామని ఆయన తెలిపారు. ఇక `దేవర` రచ్చ ఏప్రిల్ 5 నుంచి ప్రారంభమవుతుందన్నారు. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.
ఇక ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా, ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంతో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రూపొందుతుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది.