Asianet News TeluguAsianet News Telugu

భారీ ధరకు ‘దేవర’OTT రైట్స్, ఎవరికి,ఎంతకి ?

2024 ఏప్రిల్ 5న దేవర రిలీజ్ కానుంది. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Ntr #Devara all languages digital streaming rights closed for a huge number jsp
Author
First Published Sep 29, 2023, 7:42 AM IST


జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులు మెచ్చిన,   'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర' (Devara Movie).స్టార్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ  లో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాపై ఓ రేంజిలో  క్రేజ్ నెలకొంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్రం ఓటిటి రైట్స్ లాక్ చేసినట్లు సమాచారం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న వార్తలు మేరకు  'దేవర' ఓటిటి రైట్స్  ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన  నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సంస్థ  "ఓ టి టి" రైట్స్  కోసం  120 కోట్ల భారీ ధర చెల్లించటానికి ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు  ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే అఫీషియల్ సమాచారం కాదు ఇది. నెట్ ప్లిక్స్ దాకా నిజమే కానీ రేటు ఎంత అనేది మాత్రం ఖచ్చితంగా ఇదే అని చెప్పలేం. 
 
గత కొద్ది రోజులుగా బీచ్ సెట్ వేసి మరీ ఎన్టీఆర్‌పై యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మరో పది రోజుల పాటు ఈ ఫైట్‌ చిత్రీకరిస్తారని అంటున్నారు. ఇంతకు ముందు  కూడా ఓ నీళ్లలో భారీ యాక్షన్‌ ఘట్టాన్ని రూపొందించారు. ముందు యాక్షన్‌ పార్ట్‌ తీసి, ఆ తరవాత టాకీ మొదలెట్టాలన్నది చిత్ర టీమ్ ఆలోచన. వీఎఫ్ ఎక్స్‌కి ప్రాధాన్యం ఉన్న కథ కావటంతో ముందు అందుకు అవసరమైన సీన్స్ తీస్తున్నారు

దేవర' చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కొరటాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాతలు.  ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2024 వేసవిలో విడుదల చేస్తారు. ఇందులో ఎన్టీఆర్‌ రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఓ గెటప్‌ రివీల్‌ చేశారు. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. దేవర పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios