యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని, కృష్ణాజిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ మరణం పట్ల ఎన్టీఆర్ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని, ఆయన లేని లోటు తీరదని అన్నారు.

ఈ మేరకు మీడియాకి ఓ లేఖ విడుదల చేశారు. అందులో.. ''నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణ జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. 'నిన్ను చూడాలని' చిత్రం తో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరం గా ముగిసిపోతుంది అని ఊహించలేదు. నటుడిగా నేను చుసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో, నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వరకు నాకు తోడు గా ఉన్న వారి లో జయదేవ్  చాలా ముఖ్యమైన వారు. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి ని తెలుపుతున్నాను'' అని అభిమాని మృతిపట్ల విచారణ వ్యక్తం చేశారు.