ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో రెండు షేడ్స్...!

NTR character to have dual shades
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'అరవింద సమేత... వీరరాఘవ'. ఇందులో అరవింద హీరోయిన్ పూజా హెగ్డే అయితే... వీరరాఘవ ఎన్టీఆర్. సినిమాలో హీరో పూర్తి పేరు వీరరాఘవరెడ్డి. రాయలసీమ గడ్డ మీద్ద పుట్టిన బిడ్డ. ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో ఎన్టీఆర్ ఆహార్యంలో, కత్తి పట్టడంలో, కళ్లలోని కసితో సీమ పౌరుషం కనిపించింది.

అయితే... ఈ సినిమా ఆసాంతం ఎన్టీఆర్ వీరరాఘవరెడ్డిగా కనిపించరని సమాచారమ్. రాయలసీమలో మాత్రమే రెడ్డి రోల్. సిటీలో సిద్ధార్థ్ గౌతమ్‌గా కనిపిస్తార్ట‌. అలాగని ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయడం లేదు. సినిమాలో ఆయన డ్యూయల్ యాక్షన్ చేయడం లేదు. సింగిల్ క్యారెక్టరే. కాకపోతే క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ వున్నాయట. సిటీలో వున్నప్పుడు సిద్ధార్థ్ గౌతమ్‌గా సాఫ్ట్‌గా కనిపించిన హీరో, రాయలసీమకి రాగానే వీరరాఘవరెడ్డిగా యాక్షన్ మోడ్‌లోకి దిగుతాడట.

రెండు షేడ్స్ ఎలా వుంటాయో సినిమా వచ్చాక తెలుస్తుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి తమన్ సంగీత్ దర్శకుడు.

loader