మహేష్, చరణ్ లకు ఛాలెంజ్ విసిరిన తారక్

First Published 1, Jun 2018, 11:21 AM IST
NTR Challanges mahesh, charan, kalyan ram, koratal and ss rajamouli
Highlights

మహేష్, చరణ్ లకు ఛాలెంజ్ విసిరిన తారక్

సినీనటుడు మోహన్ లాల్ తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు సామాజిక మాధ్యమాల్లో ఫిట్‌ నెస్‌ ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే. ఆయన ఛాలెంజ్‌ను స్వీకరించిన తారక్‌.. ఈరోజు జిమ్‌లో వ్యాయామం చేస్తూ తీసుకున్న వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. తాను మామూలుగానే తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఆధ్వర్యంలో రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తానని చెప్పాడు.

ఇక ఆయన మహేశ్‌ బాబు, నందమూరి కల్యాణ్‌ రామ్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివకు 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' ఛాలెంజ్ చేశారు. అయితే, రామ్‌ చరణ్‌ తేజ్‌కు ట్విట్టర్‌ అకౌంట్‌ లేకపోవడంతో.. తన ఛాలెంజ్‌ విషయాన్ని చెర్రీతో చెప్పాలని ట్విట్టర్‌లో ఉపాసనను కోరారు. కాగా, కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ ను దేశంలోని చాలా మంది సెలబ్రిటీలు స్వీకరిస్తోన్న విషయం తెలిసిందే.

 

loader