ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌ హీరోగా నటిస్తున్న మరో సినిమా `మ్యాడ్‌`. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ చిత్రాన్ని  ప్రకటించారు. తాజాగా టీజర్‌ విడుదల చేశారు. 

ఎన్టీఆర్‌ బావమరిది నార్నేనితిన్‌ (ప్రణిత సోదరుడు) హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఆయన మరో సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అదే `మ్యాడ్‌`. ప్రముఖ నిర్మాత ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) కూతురు హారిక సూర్యదేవర ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్నారు. నూతన దర్శకుడు కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో నార్నే నితిన్‌తోపాటు సంగీత్‌ శోభన్‌, రామ్ నితిన్‌, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సునీల్‌ కుమార్‌, గోపికా ఉద్యన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై హారిక సూర్యదేవరతోపాటు త్రివిక్రమ్‌ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 

తాజాగా రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా `మ్యాడ్‌` చిత్ర టైటిల్‌ని ప్రకటించడంతోపాటు చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈసినిమా సాగుతుందని తెలుస్తుంది. కాలేజ్‌లో అల్లరి, ర్యాగింగ్‌, గొడవలు, ఆటలు, ఫైట్లు వంటి అంశాలను ప్రధానంగా సినిమా సాగుతుందని టీజర్‌ చూస్తుంటే తెలుస్తుంది. టీజర్‌ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఎన్నోసెంట్‌ కామెడీ బాగుంది. సినిమాపై పాజిటివ్‌ బజ్‌ని పెంచుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై మరింత బజ్‌ ఏర్పడింది. 

స్టార్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయి భారీ ఎంట్రీతో కాకుండా ఇలా సింపుల్‌గా కంటెంట్‌ ఉన్న చిత్రంతో అభినందనీయం. ఆయన టేస్ట్ కి ఇది అద్దం పడుతుంది. ఇక చిత్రం గురించి యూనిట్‌ చెబుతూ, `సూర్యదేవర నాగవంశీ తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఎదిగారు. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుటుంబం నుండి వచ్చిన ఆయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని, గొప్ప పేరుని సంపాదించుకున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న సితార సంస్థ వైవిధ్యమైన చిత్రాలను అందిస్తోంది. అలాగే, సూర్యదేవర నాగ వంశీ తన నిర్మాణ సంస్థ ద్వారా ప్రతిభావంతులైన దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

YouTube video player

తాజాగా సూర్యదేవర నాగ వంశీ, రక్షా బంధన్ సందర్భంగా తమ సంస్థ నుండి ఒక ప్రత్యేక చిత్రాన్ని ప్రకటించారు. చినబాబు కుమార్తె, నాగ వంశీ సోదరి హారిక సూర్యదేవర ఈ కొత్త చిత్రం 'ప్రొడక్షన్ నెం.18'తో నిర్మాతగా పరిచయమవుతుండటం విశేషం. నాగ వంశీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయి సౌజన్య, హారిక సూర్యదేవర నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి 'మ్యాడ్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌ ఇప్పటికే `శ్రీ శ్రీ శ్రీ రాజావారు` అనే చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. అందులో మాస్‌లుక్‌లో కనిపించారు. ఆ సినిమా ఇంకా రిలీజ్‌ కాలేదు. ఇప్పుడు మరో సినిమాని ప్రకటించారు. దీంతోపాటు మరో రెండు మూడు చిత్రాలు ప్రారంభ దశలో ఉన్నాయని తెలుస్తుంది.