సౌత్ లో నటనపరంగా అలాగే డ్యాన్సుల్లో అన్ని విధాలుగా ఆకట్టుకునే హీరోల్లో ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉంటాడని చెప్పవచ్చు. యాక్షన్ అయినా కామెడీ అయినా తనదైన శైలిలో ప్రజెంట్ చేసి మెప్పిస్తాడు. ఇకపోతే ప్రస్తుతం తారక్ వరుసగా తన మార్కెట్ ను పెంచుకుంటూనే ప్రయివేట్ యాడ్స్ తో నాలుగు రాళ్ళూ వెనకేసుకుంటున్నాడు. 

ఇప్పటికే కొన్ని ప్రాడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ఇంటర్నేషల్ లెవెల్లో పాపులర్ అవుతున్న అపీ ఫీజ్(Appy fizz) కి బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడేళ్లకు గాను జూనియర్ ఒప్పందాన్ని కుదుర్చుకోని 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నాడట. అఫీషియల్ గా రేపో మాపో ఈ వార్తపై క్లారిటీ రానుంది. 

ఇప్పటికే నవరథన్ - మలబార్ గోల్డ్ వంటి కంపెనీల యాడ్స్ లలో కనిపించి షాక్ ఇచ్చిన తారక్ మరికొన్ని రోజుల్లో సౌత్ లో కూడా అపి ఫీజ్ ప్రకటనతో అలరించనున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ ప్రముఖ కంపెనీకి నార్త్ సైడ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తారక్ రాజమౌళి RRR ప్రాజెక్టు తో బిజీగా ఉన్నాడు.