ఎన్టీఆర్ తారాజువ్వలా దూసుకుపోతున్న హీరో. తారక్ గురించి చిన్న విషయం బయటకు వస్తేనే నానా హంగామా చేసే ఫ్యాన్స్ ఇక బర్త్ డే వస్తే ఆగుతారా. మే 20న తారక్ బర్త్ డే సందర్బంగా వారం రోజుల ముందే సంబరాలు మొదలెట్టారు. సిటీల నుండి చిన్న చిన్న పల్లెల దాక మే 20న పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి రెడీ అయ్యారు. రక్తదానం, అన్నదానం అంటు పలు కార్యక్రమాలు చేయడానికి ఫ్యాన్స్ అందరు ఒక్కటయ్యారు.  

టాలీవుడ్‌లోని అన్ని సెలబ్రిటీ కుటుంబాలతో మమేకం అవుతూ, కలుపుగోలుగా ఉంటూ.. మల్టిస్టారర్ శకానికి తెర తీస్తూ.. మిగతా హీరోల సినిమాల్ని ప్రమోట్ చేస్తూ.. కొత్త ట్రెండ్‌కి దారి పరిచేశాడు యంగ్ టైగర్. మహేష్ బాబు హీరోగా చేసిన ‘భరత్ అనే నేను’ మూవీ వేడుకలోనూ, ‘మహానటి’ ఆడియో ఫంక్షన్లోనూ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలబడ్డ తారక్.. ఇండస్ట్రీలో తనకున్న క్రేజ్ ఎంతన్నది తెలియజెప్పాడు. మూడు వరుస హిట్లు ఇవ్వడం, రామ్‌చరణ్‌తో కలిసి రాజమౌళి డైరెక్షన్లో భారీ ప్రాజెక్ట్ చేస్తుండడం లాంటి అంశాలన్నీ తారక్ కమర్షియల్ వ్యాల్యూని అమాంతం పెంచేశాయి. తమ హీరో.. జస్ట్ హీరో మాత్రమే కాదని, ఒక బ్రాండ్ అనీ తారక్ ఫ్యాన్స్ చెప్పుకోవడం కనిపిస్తోంది.

 ఈ నేపథ్యంలో.. తారక్ బర్త్‌డే అనేది పరిశ్రమ మొత్తానికి ఒక పర్వదినం లాంటిదన్నది వాళ్ళ మాట! అందుకే.. సోషల్ మీడియాలో తారక్ పుట్టినరోజు వారోత్సవాలు జరుపుకుంటోంది అభిమానగణం. ఈ సందర్భంగా ఒక ఫ్యాన్‌మేడ్ పిక్.. విపరీతంగా వైరల్ అవుతోంది. మరోవైపు త్రివిక్రమ్ తో చకచక షూటింగ్ జురుపుకుంటు దసరాకి విడుదలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. తారక్ బర్త్ డే రోజు ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారని తారక్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.