వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈరోజు ఆయన 40వ బర్త్ డే సందర్భంగా తారక్ సినిమాల నుంచి వరుస అప్ డేట్స్ ను వదులుతున్నారు టీమ్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ రేంజ్ కు ఎదిగిన ఈ హీరో.. ప్రస్తుతందర్శకుడు కొరటాల శివతో NTR30 లో నటిస్తున్నాడు. ఈసినిమాకు దేవర టైటిల్ ను రీసెంట్ గా ప్రకటించారు మేకర్స్. దేవర నుంచి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. సూపర్ ఫాస్ట్ గా ఈసినిమా షూటింగ్ జరుగుతుండగా..వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటన వచ్చింది. ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, అందాల భామ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ జోడీగా నటిస్తూ.. హీరోయిన్‌గా సౌత్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఎన్టీఆర్ ఈ ఏడాది తెరపై సందడి చేయనట్టే అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. మరి ఆయన నెక్ట్స్ సినిమా సంగతేంటి. ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేశారు. ఇక తాజాగా ఈరోజు(20 మే) ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి అప్ డేట్ ను రిలీజ్ చేశారు టీమ్. తారక్ కు బర్త్ డే విష్ చేస్తూ.. వారి కాంబోలో సినిమా 2024 మార్చ్ లో స్టార్ట్ కాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత NTR 31వ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అని గతంలోనే ప్రకటించారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ దేవర సినిమాతో ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే వీరి కాంబో సెట్స్ మీదకు వెళ్లనుంది. సలార్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. దేవర వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ప్రశాంత్ నీల్ సలార్ రిలీజయ్యాక ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ చేసి వచ్చే మార్చ్ లో షూట్ కి వెళ్లనున్నట్టు సమాచారం. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ రాండంతో.. ప్రస్తుతం కొరటాలతో చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని..కొరటాల శివ సాలిడ్ కథను తయారు చేసుకున్నాడు. చాలా గ్యాప్ తరువాత ఈసినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేశారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈసినిమా కోసం పనిచేస్తున్నారు. మూడో షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీసెట్ మధ్య..ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
