దసరాకే ఎన్టీఆర్ బయోపిక్

First Published 29, Mar 2018, 1:36 PM IST
ntr biopic release during dussara only
Highlights
అన్నీ కుదిరితే దసరాకే ఎన్టీఆర్ బయోపిక్

‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్‌కి సంక్రాంతికి విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ముందే చెప్పింది. అయితే ఇప్పుడు బ‌యోపిక్ ముందే వ‌చ్చేస్తుంది. సంక్రాంతి కంటే ముందుగా ద‌స‌రాకే ఈ సినిమాని విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యాన్ని తేజ ప్ర‌క‌టించాడు కూడా. `ద‌స‌రాకి ఈ చిత్రాన్ని విడుద‌ల చేద్దామ‌నుకుంటున్నాం` అంటున్నాడు తేజ‌.

”నేను రామారావు గారికి పెద్ద ఫ్యాన్‌. ఈ సినిమా కోసం న‌న్ను సంప్ర‌దించినప్పుడు నేనుక‌రెక్ట్ కాదేమో అనిపించింది. అందుకే ఆయ‌న స్థాయికి నేను తీయ‌లేనేమో అన్నా. కానీ విష్ణు న‌న్ను ఒప్పించారు. ఈ అవ‌కాశం ద‌క్క‌డం నిజంగా అదృష్టం. దాన్ని నిల‌బెట్టుకుంటా. ఈ సినిమా బాగా తీస్తా. త‌ప్పులుంటే మీరు క్షమించండి. క‌థ‌తో చాలా సంతృప్తిగా ఉన్నా. నేను రాసిన క‌థ కాదు. జ‌రిగిన క‌థ‌. చ‌రిత్ర. ఆరు సినిమాలు తీయాల్సినంత ఉంది. ఆరు సినిమాల క‌థ ఒక సినిమాలో తీసుకురావ‌డానికి టైమ్ ప‌డుతుంది. ద‌స‌రాకి విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం” అన్నాడు తేజ‌.

ద‌స‌రా అంటే ఇంకా ఆరు నెల‌లుంది. ఈ లోపు సినిమాని పూర్తి చేయ‌గ‌ల స‌మ‌ర్థత తేజ‌ కుంది. అనుకున్న‌వ‌న్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ఈ సినిమా దస‌రాకి వ‌చ్చేస్తుంది.

loader