Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ బయోపిక్: నందమూరి అభిమానుల బాదేమిటంటే?

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయుడిగా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై అంచనాలు పెరుగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు భాగాలుగా తెరక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా కొనసాగుతోంది.

ntr biopic postponed situation
Author
Hyderabad, First Published Oct 31, 2018, 7:39 PM IST

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయుడిగా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై అంచనాలు పెరుగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు భాగాలుగా తెరక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా కొనసాగుతోంది. బాలకృష్ణ తన తండ్రి పాత్ర కోసం రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతున్నాడు. 

ఇకపోతే సినిమాకు సంబందించిన ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. రిలీజ్ డేట్ విషయంలో అభిమానుల నుంచి కొంత ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈ బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు జనవరి 9న రిలీజ్ కానుండగా రెండవ భాగం మహానాయకుడు జనవరి 24న రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ముందు నుంచి చెబుతూ వస్తోంది. 

అయితే గ్యాప్ తక్కువగా ఉండటంతో బాలకృష్ణ సన్నిహితుల నుంచి అభిమానుల నుంచి ఒక రిక్వెస్ట్ అందుతోందట. ఈ విధంగా సినిమాలు రిలీజైతే కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని కొంత గ్యాప్ ఇచ్చి రిలీజ్ చెయ్యాలని చెబుతున్నట్లు సమాచారం. పర్ దీంతో చిత్ర యూనిట్ ఈ విషయం గురించి త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios