నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న  సినిమా యన్‌.టి.ఆర్‌. నందమూరి తారకరామారావు బయోపిక్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా దాదాపు పూర్తైనట్లు సమాచారం. 

తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ కావటంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఓవర్‌సీస్‌లో ఈ సినిమా 18 కోట్లు పలికినట్టుగా తెలుస్తోంది. 

ఇప్పటిదాకా బాలకృష్ణకు ఓవర్ సీస్ మార్కెట్ బాగా పూర్. కానీ  బాలయ్య మీద నమ్మకంతో కాకుండా ఎన్టీఆర్ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమా ఆ రేటుకు సొంతం చేసుకున్నట్లు చెప్తున్నారు. అయితే బాలయ్య కూడా ఈ రేటు చూసి ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. 

అయితే ఇంత ఎమౌంట్‌ను యన్‌.టి.ఆర్‌ తిరిగి వసూళు చేయగలదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాలేవి ఓవర్‌సీస్‌లో ఈ స్థాయిలో వసూళ్లు సాధించలేదు. కానీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ వేరు. ఎన్టీఆర్ ని దేవుడుగా ఆరాధించే వర్గం, తెలుగుదేశం వారు ఈ సినిమా ఏ మాత్రం బాగున్నా...రికార్డ్ స్దాయికు తీసుకువెళ్ళిపోతారనటంలో సందేహం లేదు. దాంతో  ఖచ్చితంగా యన్‌.టి.ఆర్‌తో బాలయ్య సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తాడాని అంచనాలు వేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్న ఈ సినిమాకు  ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించేశారు. ఒక్కో పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ సినిమా మీద హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు.  ఎన్టీఆర్‌గా బాలయ్య, చంద్రబాబు పాత్రలో రానా కనిపిస్తుండగా ఎన్టీఆర్‌ సతీమణి బసవ తారకం పాత్రలో విద్యాబాలన్‌ నటిస్తున్నారు.