అన్నగారి బయోపిక్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

First Published 24, Nov 2017, 6:33 PM IST
ntr biopic muhurtham fixed for opening and teaser
Highlights
  • స్వర్గీయ నందమూరి తారకరామారావుపై సినిమాలు
  • తేజ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కించనున్న బాలయ్య
  • ఈ చిత్రం ప్రారంభానికి జనవరి 18 ముహూర్తంగా ఖరారు

ఆంధ్రుల ఆరాధ్య దైవంగా కీర్తి గడించిన మాజీ ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు, అన్న ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర కథాంశంగా తెర‌కెక్కే బ‌యోపిక్‌ల మ్యాట‌ర్ ఇప్పుడు టాలీవుడ్‌నే కాక తెలుగు రాజ‌కీయాల్లోను పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు తెరకెక్కుతున్నాయి.  వీటిలో నందమూని బాలకృష్ణ మాత్రం తన తండ్రి జీవిత కథ తో ఓ సినిమా తీస్తున్నారు.

 

బాలయ్య తెరకెక్కించనున్న మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అంద జేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి నందమూరి అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా ప్రారంభానికి జ‌న‌వ‌రిలో ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం టీజర్‌ను సిద్ధం చేయిస్తున్నాడట బాలయ్య. ప్ర‌స్తుతం స్క్రిఫ్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాను జ‌న‌వ‌రి 18న ఎన్టీఆర్ వ‌ర్థంతి సంద‌ర్భంగా లాంఛ్ చేయ‌నున్నారు.

 

ఇక ఈ సినిమా కోసం టాప్ టెక్నీషీయ‌న్లు ప‌ని చేస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీత దర్శకుడిగా, సాయి మాధవ్ బుర్రా మాటల రచయితగా, రవివర్మన్ సినిమాటోగ్రాఫర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మిగతా టెక్నీషీయ‌న్లు, నటీనటుల ఎంపిక ప్రక్రియ జోరుగా సాగుతోందట. మరి ఎన్టీఆర్ బయోపిక్ ముహూర్తం రోజే చూపించబోయే టీజర్ ఎలా వుంటుందో చూడాలి.

loader